MoviesTL రివ్యూ: స్వాగ్‌.. ప‌రమ రొటీన్ బోరింగ్ డ్రామా

TL రివ్యూ: స్వాగ్‌.. ప‌రమ రొటీన్ బోరింగ్ డ్రామా

నటీనటులు : శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను మరియు గోపరాజు రమణ తదితరులు
ఎడిటింగ్‌ : విప్లవ్ నైషదం
సినిమాటోగ్రఫీ : వేదరామన్ శంకరన్
మ్యూజిక్‌ : వివేక్ సాగర్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్
దర్శక‌త్వం : హసిత్ గోలి
రిలీజ్ డేట్‌: 4 అక్టోబ‌ర్‌, 2024

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్‌. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

Sree Vishnu's SWAG Movie Review - Telugu 360

స్టోరీ :
శ్వాగణిక వంశానికి చెందిన రాజు కుటుంబానికి చెందిన వార‌స‌త్వం క‌థ ఒక‌టి ఉంటుంది. ఇదిలా ఉంటే పోలీస్ అయిన భవభూతి (శ్రీ విష్ణు) ఓ మొరటి మనిషి. తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక అనుభూతి (రీతూ వర్మ) ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది. ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం. ఈ మధ్యలో సింగ (యంగ్ శ్రీ విష్ణు) కథ ఏమిటి ?, రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం అతను పడిన పాట్లు ఏమిటి ?, తండ్రి ఎవరో తెలియని అతని జీవితంలోకి ఈ శ్వాగణిక వంశం ఎలా వచ్చింది ?, సింగ తల్లి రేవతి (మీరా జాస్మిన్) పాత్ర ఏమిటి ?, ఈ మొత్తం కథలో శ్వాగణిక వంశానికి చెందిన వారసుడు ఎవరు ?, ఆ వారసత్వం కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?, చివరకు వారసుడు దొరికాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

Swag movie review: శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ రివ్యూ | sree vishnu swag  movie review does Sree Vishnu avatars save the movie

విశ్లేష‌ణ :
సినిమాలో శ్వాగణిక వంశానికి చెందిన ‘రాజు’ ఫ్యామిలీ కథ నుంచి స్టార్ట్ అయ్యి పోలీస్ ఆఫీసర్ భవభూతి సోలో ట్రాక్.. సింగ లవ్ స్టోరీ వరకూ చాలా పాత్రల మధ్య ఈ క‌థ న‌డుస్తుంది. సినిమాలో ఫ‌న్నీ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఎంటర్టైనింగ్ మోడ్‌లో సాగిన సినిమాలో గుడ్ మెసేజ్ తో పాటు కొన్ని బరువైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి. శ్రీ విష్ణు చేసిన ఐదు పాత్రలు… గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి. పైగా, సినిమాలో శ్వాగణిక వంశానికి చెందిన థీమ్ కూడా బాగుంది. హీరో కెరీర్‌లో ఈ సినిమా చాలా కొత్త‌గా ఉంది. హీరోయిన్ రీతూ వర్మ చక్కగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన గోపరాజు రమణ ఆకట్టుకున్నాడు. మీరా జాస్మిన్ పాత్రకి స్కోప్ లేక‌పోయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రవి బాబు నటన కూడా సహజంగా ఉంది. దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, గెటప్ శ్రీను పాత్రల పరిధి మేరకు నటించారు.

క‌థ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు న‌టీన‌టుల ప‌నితీరు బాగున్నా… కథనం విషయంలో మాత్రం దర్శకుడు హసిత్ గోలి ఆస‌క్తి కలిగించ లేకపోయారు. శ్వాగణిక వంశ‌ వారసత్వం చుట్టూ సాగే డ్రామాలో రిపీటెడ్ సీన్లు ఎక్కువ‌య్యాయి. సెకండాఫ్‌లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్లు వర్కౌట్ కాలేదు.స్క్రీన్ ప్లే డిజ‌ప్పాయింట్ చేసింది. పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం సీన్లు సాగ‌దీయ‌డం… లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా రొటీన్ గానే సాగింది.

Swag: Sree Vishnu is ready to entertainer with Teaser on?

ఫైన‌ల్‌గా…
స్వాగ్ అంటూ వ‌చ్చిన శ్వాగణిక వంశానికి చెందిన ఈ వారసత్వ కథలో.. స్టైలిష్ మేకింగ్, కొన్ని ఫన్ మూమెంట్స్ … ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు. శ్రీవిష్ణు – మిగిలిన నటీనటుల నటన సినిమాకి ప్లస్ కాగా… ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్… బోరింగ్ సీన్స్, రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు సినిమాను మైన‌స్ చేశాయి.

స్వాగ్ రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news