నటీనటులు : గోపీచంద్, కావ్య థాపర్, జిషు సేన్‌గుప్తా, శ్యామ్, నరేష్, సునీల్, ప్రగతి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ రాజ్ తదితరులు.
ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ : KV గుహన్
మ్యూజిక్ : చైతన్ భరద్వాజ్
నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి.విశ్వ ప్రసాద్
దర్శకత్వం : శ్రీను వైట్ల
రిలీజ్ డేట్ : అక్టోబర్ 11, 2024
పరిచయం :
మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘విశ్వం’. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు హిట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. వీరిద్దరు కలసి చేసిన విశ్వం సినిమా వీళ్లకు హిట్ ఇచ్చిందా ? లేదా ? అన్నది చూద్దాం.
స్టోరీ :
గోపి (గోపీచంద్) తాను ప్రేమించిన సమేరా (కావ్య థాపర్) కోసం ఇటలీ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ అసలు పేరు విశ్వం అని తెలుస్తుంది. అసలు విశ్వం గోపీగా ఎందుకు మారాడు. పాప దర్శనను చంపడానికి టెర్రరిస్టులు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు. పాపకు.. తీవ్రవాదులకు ఉన్న లింక్ ఏమిటి ? ఈ క్రమంలోనే విశ్వం జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకున్నారు. ఆ మలుపులు ఏంటి ? చివరకు ఆ తీవ్రవాదులను విశ్వం ఎలా అంతం చేశాడు ? అన్నదే స్టోరీ.
విశ్లేషణ :
సినిమాలో గోపీచంద్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌లోనూ గోపీచంద్ మెప్పించాడు. తన పాత్ర పరిస్థితులకు తగినట్టుగా గోపీచంద్ నటన బాగుంది. కావ్య థాపర్‌తో సాగిన లవ్‌స్టోరీలోనూ గోపీచంద్ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కావ్య గ్లామర్ సన్నివేశాల్లో బాగా న్యాయం చేసింది. కీలక పాత్రలో నటించిన జిషు సేన్‌గుప్తా మెప్పించాడు. జిషు సేన్‌గుప్తా – సునీల్ మధ్య సన్నివేశాలు అదిరిపోయాయి. మిగిలిన నటుల్లో నరేష్, ప్రగతి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్ కామెడీ సీన్లు బాగున్నాయి. పృధ్వీ రాజ్ సీన్లు.. కామెడీ బాగా పేలింది.
విశ్వం పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్లు డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. అయితే పాత్రను బాగా రాసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల సినిమా ట్రీట్మెంట్ అంతే స్థాయిలో రాసుకోలేదు. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ఇంకా ఇంట్రెస్ట్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే హీరో ఫ్లాష్ బ్యాగ్ ను ఇంకా బాగా చూపించాల్సింది. కొన్ని కామెడీ సన్నివేశాలు తప్ప మిగిలిన కథనంలో అంత జోష్ లేదు. అయితే శ్రీను వైట్ల మార్క్ కామెడీ… డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం బిలోవ్ యావరేజ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్ర ఇంకా స్ట్రాంగ్‌గా డిజైన్ చేసుకోవాల్సింది.
దర్శకుడు శ్రీను వైట్ల తన టేకింగ్‌తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్‌కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని సీన్లను ట్రిమ్ చేయవచ్చు. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫైనల్‌గా…
శ్రీను వైట్ల – గోపీచంద్ 50 % బ్యాక్ బౌన్స్
విశ్వం రేటింగ్ : 2.5 / 5