టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వచ్చిన దేవర సినిమాతో అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ సింగల్ హ్యాండ్‌తో దేవర సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసి పడేశారు. ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా దాదాపుగా రూ.550 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటోచాటి చెప్పింది.
ఇదిలా ఉంటే చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అవసరం ఉన్నా, లేకపోయినా రెగ్యులర్గా ఒక ఊతపదం వాడుతూ ఉంటారు. సామాన్య జనాలు మాత్రమే కాదు.. పాపులారిటి తెచ్చుకున్న స్టార్ హీరోలు సెలబ్రిటీలు సైతం కొన్ని పదాలు తరచూ వాడుతుంటారు. మరియు ముఖ్యంగా రామ్ చరణ్, తారక్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ కూడా కొన్ని ఊతపదాలను పదే పదే వాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒక ఊతపదం తరచూ వాడుతూ ఉంటారట.
ఎన్టీఆర్ తరచూ వాడే ఊతపదం ఏంటో కాదు అరే నీ.. సహజంగా మనకు ఏదైనా కోపం వచ్చినా మనకు నచ్చిన పని చేసిన.. అరే నీ.. అనే పదం వాడి ఏదో ఒక తిట్టు తిడుతూ ఉంటాం. అలా జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఊతపదం తరచూ నోట్లో నుంచి వస్తుందట. షూటింగ్స్, పార్టీలోనూ బయట ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాడట. దాదాపు ఈ పదం రోజుకి తారక్ నోటినుంచి కనీసం 10, 15 సార్లు పైగానే వస్తుందట. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.