ఇప్పుడు అంటే ఒంటినిండా పచ్చబొట్టులు వేయించుకోవడం, టాటూస్ వేయించుకోవడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు అలా కాదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే.. అది కూడా చాలా రేర్ గా టాటూస్ వేయించుకునేవారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే బాలీవుడ్ నటిమణులు ఎక్కువగా పచ్చబొట్లు – టాటూస్ వేయించుకునేవారు. కానీ.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అసలు టాటూస్ వేయించుకునే వారు కాదు. ఒకరిద్దరు టాటూప్ వేయించుకున్నా ఆ విషయాన్ని బయట పెట్టేవారు కాదు.
అయితే దివంగత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఒంటిపై కూడా ఒక పచ్చబొట్టు ఉండేదట.. అది కూడా ఆయన ఎంతో ఇష్టంగా వేయించుకున్నది కావటం విశేషం. ఆ పచ్చబొట్టు మరేదో కాదు ఓం. మొదటి నుంచి దైవభక్తి గల సీనియర్ ఎన్టీఆర్.. తన ఒంటిపై ఒకే ఒక పచ్చబొట్టును పొడిపించుకున్నారు. అది కూడా రాజకీయాల్లోకి వచ్చే ముందు కావటం విశేషం.
ఆ దేవుడు అనుగ్రహం తనపై ఉండాలి. ప్రజలకు బాగా సేవ చేయాలి అనుకుంటున్నానని.. భక్తి భావంతో ఓం అనే పచ్చ బొట్టును ఎన్టీఆర్ తన ఒంటిపై వేయించుకున్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయాలను తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్నారు.