గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమాలు వస్తున్నాయంటే తెలుగు ప్రేక్షకుల్లో, తెలుగు సినిమా వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ప్లాప్‌లు అయినా చెక్కుచెదరని రికార్డ్ పవన్ కళ్యాణ్ సొంతం. అటు రామ్ చరణ్ కు కూడా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఏకంగా గ్లోబల్ ఇమేజ్ వచ్చేసింది. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ 20 ఏళ్ల క్రితం చేసిన గుడుంబా శంకర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అందరూ డిజాస్టర్ అనుకున్నారు.
గుడుంబా శంకర్‌కు పవన్ సోదరుడు నాగబాబు, నిర్మాత వీరశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు వీరశంకర్ స్వయంగా చెబుతూ సినిమా అంచనాలు అందుకోలేదని.. కానీ సినిమాకు ఉన్న అందరికీ లాభాలు తెచ్చి పెట్టిందని చెప్పారు. అంటే గుడుంబా శంకర్ లాంటి జనాలకు ఎక్కని సినిమాతో కూడా అందరికీ లాభాలు తెచ్చిపెట్టిన క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా బ్రూస్ లీ కోన వెంకట్ – శ్రీను వైట్ల కాస్త గ్యాప్ తర్వాత ఈ సినిమాకు కలిసి పనిచేశారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. బ్రూస్లీ కూడా అంచనాలు అందుకోలేదు. సినిమా పోయిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా విశ్వం సినిమా ప్రమోషన్లలో శ్రీను బ్రూస్లీ హిట్టని చెప్పారు. బ్రూస్లీ సినిమాకు ఎంత బడ్జెట్ అయిందో అంత కలెక్ట్ చేసిందని.. సినిమా విషయంలో అందరూ చాలా హ్యాపీ. కానీ.. సినిమా ఇంకా అనుకున్న రేంజ్ కి రీచ్ అవ్వలేదు… ఆ రోజుల్లోనే 40 కోట్ల షేర్ రాబట్టింది. అని చెప్పారు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయిన మా అంచనాలు అందుకోలేదని చెప్పారు. గుడుంబా శంకర్ ఫ్లాప్ అయిన లాభాలు తెచ్చిపెట్టిన క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. అయితే బ్రూస్లీ ప్లాప్ అయినా సినిమా కొన్న అందరిని హ్యాపీ చేసిన క్రెడిట్ రామ్ చరణ్ సొంతం అనుకోవాలి.