Moviesఎన్టీఆర్ ద‌మ్ము ఇది... ఒక్క ఏపీలోనే ' దేవ‌ర ' సంచ‌ల‌న...

ఎన్టీఆర్ ద‌మ్ము ఇది… ఒక్క ఏపీలోనే ‘ దేవ‌ర ‘ సంచ‌ల‌న రికార్డ్‌… !

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా దేవ‌ర‌. ఈ సినిమాకు కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌త నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన దేవ‌ర సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కిన దేవ‌ర మామూలు హిట్ అవ్వ‌లేదు. ఇక దేవ‌ర భారీ హిట్ అయ్యి కొరటాల శివకి సాలిడ్ కం బ్యాక్ లా కూడా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ రోజునే కొంచెం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు నమోదు చేసింది.

Devara: Part 1 Summary, Trailer, Cast, and More

ఇప్ప‌టికే దేవ‌ర రు. 550 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఎన్నో రికార్డులు దేవ‌ర ఖాతాలో ప‌డ్డాయి.
లేటెస్ట్ గా దేవర మరో సంచలన రికార్డు సెట్ చేసింది. దేవర ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే ఏకంగా రు. 100 కోట్లకి పైగా షేర్ రాబ‌ట్టింది.. అది కూడా జీఎస్టీతో క‌లిపి కావ‌డం విశేషం. బాక్సాఫీస్ దగ్గర 25 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది.

Devara Movie Review in Telugu, Jr NTR, Janhvi Kapoor

ఒక్క ఏపీ నుంచే దేవ‌ర రు. 100 కోట్ల షేర్ రాబట్టిన మూడో సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. మరి దీనికి ముందు RRR, బాహుబలి 2 నిలవగా.. ఇప్పుడు దేవ‌ర కూడా ఈ అరుదైన రికార్డ్ త‌న ఖాతాలో వేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఒక్క ఏపీ నుంచి రెండు 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్న హీరోగా తారక్ భారీ రికార్డు సెట్ చేసాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news