Movies' పుష్ప 2 ' ప్రీమియ‌ర్ల విష‌యంలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్...

‘ పుష్ప 2 ‘ ప్రీమియ‌ర్ల విష‌యంలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇది…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ను దర్శ‌కుడు సుకుమార్ గత మూడేళ్లుగా చెక్కుతూ చెక్కుతూ వస్తున్నారు. పుష్ప తర్వాత మరోసారి తన పెర్ఫార్మన్స్ తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ కావడం లేదు.

Pushpa (Pushpa The Rise) Movie (2021): Release Date, Cast, Ott, Review,  Trailer, Story, Box Office Collection – Filmibeat

ఇప్పటికే పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ఒకరోజు ముందుకు జరిగినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 5న పుష్ప పార్టు 2 రిలీజ్ అవుతుందని.. ముంబైతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 గ్రాండ్ ప్రీమియర్ షో పడనుందని తెలుస్తోంది.

Pushpa 2: The Rule' release date announced!

ఇలా ఒకరోజు ముందుగానే పుష్ప-2 ప్రీమియర్లు వేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇలా ఒక రోజు ముందుకు రిలీజ్ డేట్ మార్చ‌డంతో పాటు ముందు రోజు సెకండ్ షోతోనే ప్రీమియ‌ర్లు వేస్తున్నారు అంటే.. వారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రష్మిక మందన్న హీరోయిన్‌గా ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news