పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కింది. ఇది బాలీవుడ్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాకు రీమేక్. ఇక రెండేళ్ల క్రితం ఇదే హరీష్ శంకర్ – పవన్ కాంబినేషన్లో భవదీయుడు భగత్ సింగ్ అన్న టైటిల్ తో సినిమా ఎనౌన్ చేశారు. తర్వాత దానిని ఉస్తాద్ భగత్‌సింగ్‌గా పేరు మార్చారు. ఇలా ఎన్ని పేర్లు మార్చినా ఇది కోలీవుడ్లో విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే.నిజానికి ఈ ప్రాజెక్టు హరీష్ శంకర్ చేతికి రాకముందే ఈ ప్రాజెక్టు తేరి రీమేక్ అన్న విషయం అందరికీ తెలుసు. అప్పటికే ఈ సినిమాపై వర్క్ చేసిన దర్శకుడు తప్పుకున్న తర్వాతే హరీష్ శంకర్ వచ్చారు. అయితే హరీష్ తనదైన స్టైల్ లో ఈ ప్రాజెక్టుకు మార్కులు చేర్పులు చేశాడు. కేవలం పాయింట్ మాత్రమే తీసుకుని గబ్బర్ సింగ్ రీమేక్‌కు ఎలాగైతే మార్కులు చేర్పులు చేశానో అలాగే చేశానని కూడా హరీష్ చెప్పాడు. ఈ సినిమాకు రైటర్ గా పని చేస్తున్న మరో దర్శకుడు దశరథ్ కూడా పలుమార్లు ఇదే విషయం చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు గతంలో చెప్పిన దశరథ ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కాదంటున్నాడు. అదే ట్విస్ట్..!దశరథ్ తాజామాట ఏమిటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తేరీ రీమేక్ కానే కాదట. ఆ సినిమాకు దగ్గరగా మాత్రమే ఉంటుందట.. అక్కడితో ఆగలేదు.. గతంలో సమాచార లోపం వల్ల ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను అందరూ రీమేక్ అనుకున్నారు.. ఇకనుంచి ఎవరూ అలా అనుకోవద్దని దశరధ్ చెపుతుండటం కామెడీగా ఉంది. అసలు 3 – 4 ఏళ్లుగా రీమేక్‌గా ముద్రపడిన ఈ ప్రాజెక్టును ఎందుకు రీమేక్ కాదని చెబుతున్నారు కదా ఏమైనా మార్చరా ? అంటే ఇక్కడ వేరే కథ ఉంది.. హరీష్ శంకర్ ఎప్పటిలాగే మిస్టర్ బచ్చన్ రీమేక్ చేసి పెద్ద డిజాస్టర్ కొట్టాడు.. ఆ ప్రభావం పవన్ సినిమాపై పడకుండా ఉండేందుకే ఇలా మాట మార్చారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.