టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా దేవర సినిమాతో తిరుగులేని పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్టీఆర్‌కు వరుసగా రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ వరుస పెట్టి ఏడు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ల గురించి ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు తారక్ రెమ్యునరేషన్ రూ.60 నుంచి రూ.70 కోట్ల రేంజ్‌లో ఉంటుంది.దేవర సినిమాకు తారక్‌కు రూ.80 నుంచి రూ.90 కోట్ల వరకు ముట్టినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తన ఏడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలు పరంపరలో.. నటించిన సినిమా నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. 2016 సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాల మధ్యలో పోటీగా రిలీజై సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ కేవలం రూ.7 కోట్ల 33 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారు. నాన్నకు ప్రేమతో రిలీజ్ తర్వాత.. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో.. అప్పట్లో తారక్ స్పందించి.. తన రెమ్యూనరేషన్ గురించి వెల్లడించారు.
నాన్నకు ప్రేమతో సినిమా.. కమర్షియల్గా హిట్‌గా నిలవడంతో పాటు.. మంచి లాభాలు కూడా తీసుకువచ్చింది. అప్పట్లోనే రూ.55 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా రూ.55 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగింది. దాదాపుగా ఈ సినిమాకు కాస్త అటు ఇటుగా అవే కలెక్షన్లు వచ్చాయి. అంతకుముందు నాన్నకు ప్రేమతో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఊసరవెల్లి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.అందుకే నాన్నకు ప్రేమతో మూవీకి ఎన్టీఆర్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని నిర్మాత భోగవల్లి ప్రసాద్‌కు వచ్చిన నష్టాలను అలా భర్తీచేసారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు పాజిటివ్గా చెప్తూ ఉంటారు. ఇక దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలలో నటిస్తున్నాడు.