టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఎన్నో విషయాలలో పోటా పోటీ ఉండేది. సినిమాల నుంచి రాజకీయం వరకు ఈ పోటీ ఇలాగే కొనసాగింది. కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. కృష్ణ తన కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడే తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని కూడా హీరోని చేయాలని ఉద్దేశంతో సామ్రాట్ సినిమా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే అప్పట్లో బాలీవుడ్ లో హిట్ అయిన బేతాబ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.
ఈ సినిమాలో హిందీలో సన్నిడియోల్ హీరోగా నటించారు. తెలుగులో దర్శకుడుగా విక్టరీ మధుసూదన్ రావు … సోనమ్ అనే బాలీవుడ్ హీరోయిన్ ను కథానాయికగా పరిచయం చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ కాంట్రవర్సీ అయింది. నిర్మాత కెసి శేఖర్ బాబు బాలకృష్ణతో సామ్రాట్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తానని చెప్పారు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకుడు. అయితే కృష్ణ సామ్రాట్ టైటిల్ తాను ముందు రిజిస్టర్ చేయించాను అని చెప్పిన శేఖర్ బాబు వినలేదు. అదే టైటిల్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాట్ టైటిల్ బాలయ్య సినిమాకే పెట్టాలని పంతం వేసుకున్నారు.
రెండు సినిమాలు సామ్రాట్ అనే టైటిల్ తో ప్రచారం కూడా చేశారు. చివరకు పరిశ్రమలో కొంతమంది పెద్దలు సర్ది చెప్పి బాలయ్య సినిమాను సహస్ర సామ్రాట్ గా మార్పించారు. విచిత్రం ఏమిటంటే ఇటు బాలయ్య సాహస సామ్రాట్ – అటు రమేష్ బాబు సామ్రాట్ సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి.