కులశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ గీతా రచయిత ఆయన కలం నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో పాటలే కాదు.. ఆ సినిమాలో డైలాగ్స్ కూడా కులశేఖర్ రాసినవే. ఒక్క సీన్ డైలాగ్స్ చూసిన వెంకటేష్ స్వయంగా నువ్వే ఈ సినిమాకి డైలాగ్స్ రాసేయ్ అనడంతో ఘర్షణ సినిమాకి మాటలు అందించారు కులశేఖర్. ఒకప్పుడు వరుసగా తేజ సినిమాలలో కులశేఖర్ పాటల ఎక్కువగా ఉండేవి. చిత్రం – జయం – నువ్వు నేను ఇలా అప్పట్లో కులశేఖర్ ఒక వెలుగు వెలిగిపోయాడు.. కానీ కులశేఖర్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు.. కొందరేమో దొంగ అంటూ మాట్లాడారు.. కొందరేమో పిచ్చివాడైపోయాడని అంటారు.
అయితే దీనికి కారణం ఒక హీరోయిన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు. కులశేఖర్ పుట్టింది సింహాచలం. ఆయనకి చిన్నప్పటి నుంచి సంగీతం.. సాహిత్యల మీద ఎక్కువగా ఆసక్తి ఉంది. చదువుకున్న రోజులలోనే పాటలు రాసి బహుమతులు కూడా అందుకున్నారు. ఈ టాలెంట్ గుర్తించిన దర్శకుడు తేజ – సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్.. కులశేఖర్ బాగా ప్రోత్సహించారు. వీరి ముగ్గురి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు వచ్చాయి. కులశేఖర్ ఘర్షణ సినిమా వరకు దాదాపు 100 సినిమాలకు పాటలు రాశారు. అప్పట్లో చాలా మంది కులశేఖర్ పాట కావాలని అడిగేవారు.
అయితే ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటూ ఏకంగా షూటింగ్స్ పార్ట్ నుంచి ఆ అమ్మాయిని తీసుకు వెళ్లిపోయాడు అన్న రూమర్లు కులశేఖర్ పై అప్పట్లో వినిపించాయి. ఇది ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. చివరకు కులశేఖర్ పరిస్థితి ఎంతకు దిగజారింది అంటే ఒక సందర్భంలో చేతిలో డబ్బులు లేక గుడిలో బంగారు ఆభరణాలు ఏవో దొంగలించాడని పోలీసులు తీసుకువెళ్లారట. ఇలాంటి సమస్యల వల్ల మానసికంగా కులశేఖర్ కుంగిపోయి మతిస్థిమితం లేకుండా పోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. ఎలాంటి అద్భుతమైన కెరియర్ కేవలం అమ్మాయి మీద వ్యామోహంతో నాశనం చేసుకున్నాడని మరికొందరు చెబుతూ ఉంటారు.