నందమూరి నటసింహం బాలయ్య కచ్చితంగా నిర్మాతల హీరో అని చెప్పాలి. బాలయ్య నిర్మాతల మనిషి. నిర్మాత బాగుంటేనే సినీ రంగం బాగుంటుంది.. పదిమందికి ఉపాధి దొరుకుతుంది.. అని ఆలోచిస్తారు. ఒక్క సినిమా హిట్ అయితే వెంటనే రెమ్యునరేషన్ పెంచే హీరోలు ఉన్న ఈ రోజులలో.. బాలయ్య 25 సంవత్సరాలు క్రితమే ఇండస్ట్రీ హిట్ వచ్చినా.. తన రెమ్యూనరేషన్ పెంచలేదు. 1999 సంక్రాంతి కానుకగా బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ సినిమా ఆరోజుల్లోనే ఏకంగా 77 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్ – సంఘవి – అంజలా ఝవేరి హీరోయిన్లుగా నటించారు. తెలుగు సినిమా చరిత్రలో చాలా రికార్డులకు దుమ్ము దులిపేస్తుంది. ఆ వెంటనే బాలయ్య ఫ్రెండ్లీ మూవీ అధినేత, చంటి అడ్డాలకు కృష్ణబాబు సినిమా చేసేందుకు కాల్‌షీట్లు ఇచ్చారు. అంతకుముందు అదే బ్యానర్లో ఆయన పవిత్ర ప్రేమ సినిమా తీశారు. సమరసింహారెడ్డి హిట్ అయ్యాక చంటి.. బాలయ్య దగ్గరికి వెళ్లి బాబు ఇలా కథ ఉంది సినిమా చేద్దాం అని చెప్పగా.. వెంటనే బాలయ్య ఓకే చెప్పారు.రెమ్యూనరేషన్ ఎంతని అడగగా బాలయ్య జస్ట్ రూ.25 లక్షలు చెప్పారట. సమరసింహారెడ్డి తర్వాత ఏకంగా కోటి రూపాయలు అడుగుతారని వెళ్లిన చంటికి బాలయ్య చెప్పిన రెమ్యూనరేషన్ విని షాక్ కొట్టినంత పనైందట. బాలయ్య రెమ్యునరేషన్‌కు ఏమాత్రం ప్రయారిటీ ఇవరని ఆయన నమ్మకంతో, ప్రేమతో మాత్రమే పని చేస్తారని.. చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ.