ప్రపంచవ్యాప్తంగానే కాకుండా.. ఇటు మనదేశంలోనూ బిగ్ బాస్ షోకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. బుల్లితెరపై వచ్చే ఎన్ని షోలు ఉన్నా బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మనదేశంలో హిందీలో మొదటిసారిగా బిగ్ బాస్ షో ప్రారంభం అయింది. ఈ షోకు తిరుగేలేని క్రేజ్ వచ్చింది. దీంతో బిగ్‌బాస్ ను ఇండియాలో అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే చాలా సంవత్సరాల క్రితమే తెలుగులో కూడా బిగ్ బాస్ షో మొదలుపెట్టారు.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే భారీ మంచి అంచనాలతో ప్రారంభమైన తొలి సీజన్‌కు ఎన్టీఆర్ తన అద్భుతమైన హోస్టింగ్‌తో సూపర్ క్రేజ్ తీసుకువచ్చారు. ఎన్టీఆర్ బిగ్‌బాస్ సీజన్ 1 కి హోస్ట్‌గా వ్యవహరించినందుకు.. అప్పట్లోనే భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారు. అప్పట్లో నిర్వాహకులు ఎన్టీఆర్‌కు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.35 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ రెమ్యూనరేషన్‌ను ఇప్పటికే బిగ్ బాస్ ఏడు సీజన్లు ముగిసిన కూడా ఎవరు బీట్ చేయలేదు. అయితే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన తొలి సీజన్‌కు వచ్చిన క్రేజ్ తర్వాత సీజన్ కు రాలేదు. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి అన్ని సీజనులకు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు బిగ్ బాస్ హోస్ట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.. అంతలా రంజింప చేశాడు అన్న టాక్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులలో ఇప్పటకీ గట్టిగా ఉంది.