Moviesతన సినిమా కోసం చిరంజీవిని వాడుకోనున్న తారక్.. వర్కౌట్ అయ్యేనా..?

తన సినిమా కోసం చిరంజీవిని వాడుకోనున్న తారక్.. వర్కౌట్ అయ్యేనా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొ ద్దిరోజుల క్రితమే దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా… శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ఈ మూవీలో ముఖ్యపాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

WAR 2 Face-Off Begins Tomorrow

దేవర సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హిందీ మూవీ అయినటువంటి వార్ 2 లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా … తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఉండటంతో వార్ 2 పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు వార్ 2 అనే టైటిల్ ను కాకుండా చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా టైటిల్ని పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

Padma Vibhushan Chiranjeevi: Magnanimous and Marvellous Mega Star - News -  IndiaGlitz.com

అసలు విషయంలోకి వెళితే … కొన్ని సంవత్సరాలు క్రితం కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఓ సినిమాకు యుద్ధభూమి అనే టైటిల్ను పెట్టారు. ఇక వార్ 2 తెలుగు వర్షన్ కు యుద్దభూమి అనే టైటిల్ను ఫిక్స్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ టైటిల్ ను నిజంగానే కన్ఫామ్ చేస్తారా ..? లేక ఇది ఒక రూమర్ ల మిగిలిపోతుందా అనేది తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news