నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం గత ఐదు, ఆరు సంవత్సరాలుగా తెలుగు సినిమా అభిమానులు మాత్రమే కాదు.. తెలుగుదేశం అభిమానులు, తెలుగు ప్రజలు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాది ఖరారు అయింది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపునకు మలుచుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. బాలయ్య తనయుడు తొలి సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పుడు నందమూరి అభిమానులు అందరూ మోక్షజ్ఞ కూడా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లా పెద్ద స్టార్ హీరో అవ్వాలని కోరుకుంటున్నారు. గతంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లుక్స్‌పై పెద్ద ట్రోలింగ్ జరిగింది. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్న మోక్షజ్ఞ.. లుక్ మొత్తం మార్చేసుకున్నాడు. తన ఇద్దరు అక్కలు సపోర్ట్ తో డైటింగ్ ప్లాన్ మార్చుకుని పర్ఫెక్ట్ హీరోకి ఉండాల్సిన కరెక్ట్ షేపింగ్‌లోకి మోక్షజ్ఞ వచ్చేసాడు. ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడిగా బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోయిన్ కుమార్తెను ఎంపిక చేయబోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది.
ఈ సినిమాలో మోక్షజ్ఞ లవర్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞపై చాలా ఘాటైన రొమాంటిక్ సీన్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకున్నాడట. సినిమాలో మోక్షజ్ఞ హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చే సీన్ హైలెట్‌గా మారిపోతుందని సినిమా యూనిట్ వర్గాల నుంచి ఇప్పటికే మ్యాటర్ లీక్ అయ్యింది. అయితే బాలయ్యకు మాత్రం తన కొడుకు మొదటి సినిమాలోని ఇలా లిప్ లాక్ సీన్లో నటించడం ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ మాత్రం మోక్షజ్ఞను తొలి సినిమాలో యూత్ కు బాగా నచ్చేలా చూపించాలి అంటే ఇలాంటి సీన్లు ఉండాల్సిందే అని చెబుతున్నారట.