సినిమా అంటే డైరెక్టర్ కెప్టెన్ … డైరెక్టర్ను సినిమాకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని పిలుస్తారు .. డైరెక్టర్ ఏం చెప్పిన కచ్చితంగా చేయాలి … తనకు కావలసినట్టుగా డైరెక్టర్ నటీనటుల నుంచి నటన రాబట్టుకుంటారు. లిప్ లాక్స్ అయినా కాస్త ఎక్స్పోజింగ్ చేయాల్సి ఉన్నా ఎవరు డైరెక్టర్ మాటకు అడ్డు చెప్పకుండా అందులో నటించాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా … ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా డైరెక్టర్ చెప్పినట్టు వినాలి. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం నేను హీరోయిన్ ఎంగిలి తాగాలా అంటూ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇంతకు మహేష్ బాబు ఏ హీరోయిన్ తాగిన ఎంగిలి తాగను అని చెప్పారు … ఏ డైరెక్టర్ పై మహేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ? అనేది చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు బాల నటుడుగా సినిమాల్లో రాణించి మొదటిసారిగా హీరోగా పరిచయమైంది రాజకుమారుడు సినిమాతో .. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రితీ జింతా హీరోయిన్గా చేసింది. ఈ సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయట. ఈ సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ పై మహేష్ బాబు కోపడ్డారట. సినిమాలో ఒకచోట ప్రీతిజింతా – మహేష్ బాబు ఒకే కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకుని తాగే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంలో మొదట ప్రీతిజింతా తాగాక తర్వాత మహేష్ బాబును తాగమని చెప్పారట.
అయితే ఆ సన్నివేశం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం డైరెక్టర్ రాఘవేంద్రరావు మహేష్ బాబు దగ్గరికి వెళ్లి చెప్పిన వెంటనే మహేష్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారట. ఏంటి మావయ్య ప్రీతిజింతా తాగాక నేను తాగాలా … నేను ఈ సీన్ చెయ్యను కావాలంటే నువ్వే చేసుకో అంటూ మహేష్ బాబు రాఘవేంద్రరావు పై కోప్పడి అక్కడ నుంచి వెళ్లిపోయారట. మహేష్ బాబు కి రాఘవేంద్రరావుకి మధ్య మంచి అనుబంధం ఉండడంతో ఆయన మొదటి నుండి డైరెక్టర్ రాఘవేంద్ర రావు ని మావయ్య అని చాలా ఆప్యాయంగా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ సన్నివేశం గురించి మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో చెప్పి నవ్వుకున్నారు.