నటసింహం నందమూరి బాలకృష్ణలో చాలా కోణాలు ఉంటాయి. బాలయ్య నిజంగా భోళామనిషి. ఆయన పైకి మాత్రమే కోపంగా కనిపిస్తారు. లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇక బాలయ్య కుటుంబ విషయాలు పెద్దగా బయటకు రావు. బాలయ్య భార్య వసుంధర అయితే బాలయ్య రాజకీయాల్లోకి వచ్చాక.. వసుంధర హిందూపురంలో బాలయ్య తరపున ప్రచారం చేస్తూ అక్కడ ప్రజలకు కావలసిన సమస్యలను పరిష్కరిస్తూ అందుబాటులో ఉంటున్నారు. ఇక బాలయ్య – వసుంధర భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యమైన బంధం ఉంది.
బాలయ్య గత 40 సంవత్సరాలుగా షూటింగ్లో బిజీబిజీగా ఉండి.. ఇంట్లో ఏనాడు పట్టించుకోలేని పరిస్థితుల్లో కూడా వసుంధర ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులను చేసింది. అందుకే బాలయ్య ప్రతి ఈవెంట్‌లోను తన భార్య వసుంధర గొప్పతనం గురించి చెబుతూ ఉంటారు. తాను ఈరోజు ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఒకటి మా నాన్న అయితే.. రెండోది భార్య వసుంధర అని.. వసుంధర ఇంట్లో పిల్లలను చూసుకోవడం కారణంగానే తాను ఇలా ఈ స్టార్ స్టేటస్ అందుకున్నాను అని.. చాలా సందర్భాలలో చెప్పారు.
తాజాగా చంద్రబాబుతో జరిగిన అన్‌స్టాపబుల్ షోలో కూడా మరోసారి బాలయ్య భార్య వసుంధర గొప్పతనం గురించి చెప్పారు. బాలయ్య పైకి చాలా కోపంగా కనిపిస్తారు. అలాంటి బాలయ్యను వసుంధర దేవి ఎలా హ్యాండిల్ చేస్తుందన్న సందేహం అందరికీ ఉంటుంది. బాలయ్య ఎంత కోపంగా ఉంటారో అంతే మంచి మనిషి కూడా. అది ఆయనను దగ్గర నుంచి గమనించే వాళ్లకు మాత్రమే తెలుసు.
ఇక బాలయ్యను వసుంధర దేవి ముద్దుగా ఏమని పిలుస్తుందో అంటూ అప్పట్లో ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అయితే దానికి వసుంధర ఆన్సర్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ.. ఫైనల్లీ ఆన్సర్ బయటపడింది. వసుంధర బాలయ్యను ముద్దుగా శ్రీవారు అని పిలుస్తారట. కన్నయ్య, బేబీ, డార్లింగ్ అంటూ రకరకాల పేర్లతో పిలుచుకున్న టైంలోనూ వసుంధర తన భర్తను శ్రీవారు అంటూ పద్ధతిగా పిలవడానికి ఇష్టపడతారట.