నటీనటులు : రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, అభిరామి, దుషారా విజయన్, రోహిణి, రావు రమేష్ తదితరులు
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్. కతీర్
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు : ఎ. సుభాస్కరన్
దర్శకత్వం : టి.జె. జ్ఞానవేల్
రిలీజ్ డేట్ : 10 అక్టోబర్, 2024
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్. జై భీమ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు జ్ఞాన్‌వేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వేట్టయాన్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
అతియన్ (రజినీకాంత్) ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) అతి దారుణంగా చంపబడుతుంది. అసలు ఆమెను చంపిన వ్యక్తి ఎవరు ?, ఈ హత్య కేసులో అతియన్ ఒక అమాయకుడిని ఎలా చంపాడు ?, చివరకు అసలు హంతకుడిని అతియన్ ఎలా కనిపెట్టాడు ?, ఈ మొత్తం కథలో నటరాజ్ (రానా) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
పవర్ ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజినీకాంత్ నటన సూపర్. రజినీ మాస్ ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీన్లు అదిరాయి. సీరియస్ క్రైమ్స్ చేసి తప్పించుకునే వారికి న్యాయపరంగా శిక్షపడాలని అమితాబ్.. అటు హద్దులు దాటి అయినా న్యాయం చేయాలని రజనీకాంత్ పాత్ర మరోవైపు.. ఈ రెండు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. రజినీకాంత్ వర్సెస్ రానా దగ్గుబాటి మధ్య సీన్లు.. డైలాగులు బాగున్నాయి. రానా కూడా చాలా బాగా నటించాడు. సెకండాఫ్ లో రానా పాత్రను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు ఆ పాత్ర కూడా కనెక్ట్ అయ్యింది. మిగిలిన నటులు ఓకే. ఓ హత్యతో కథలో సీరియస్ టర్న్‌తో ఫస్టాఫ్ బాగా డిజైన్ చేశారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్. దర్శకుడు యాక్షన్ ఎలిమెంట్స్.. ఎమోషనల్ కంటెంట్ బాగా ఎలివేట్ చేశాడు. మెయిన్ పాయింట్… ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సంఘర్షణ బాగున్నా… ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేవు. కథను ఎలివేట్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ ల్యాగ్ లేకుండా, ఇంకా ఎమోషనల్ ప్లేతో ఉండాల్సింది. సెకండాఫ్ బోరింగ్ సీన్లు ఉన్నాయి. రానా పాత్ర లాజికల్‌గా ఇంకా బలంగా రాసుకోవాలి. సినిమాకు సెకండాఫ్ మైనస్.
ఫైనల్‌గా…
వేట్టయన్ రజనీ స్టైల్ యాక్టింగ్ ఎమోషనల్ సినిమా
రేటింగ్ : 2.5 / 5