పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఏ హీరోయిన్ కు అయినా ఛాన్స్ వచ్చింది అంటే చాలు ఎగిరి గంతేస్తారు .. ఎంత గొప్ప హీరోయిన్ అయినా … ఎంత స్టార్ హీరోయిన్ అయినా పవన్ పక్కన పవన్ సినిమాలో నటించే ఛాన్స్ అంటే వాళ్లకు అంతకు మించిన ఆనందం ఏమవుతుంది. పవన్ పక్కన ఒక సినిమాలో నటిస్తే చాలు తమ రేంజ్ మారిపోతుందని తమ కెరీర్ కు తిరిగి ఉండదని తమకు తిరుగులేని అవకాశాలు వస్తాయని హీరోయిన్లు అందరూ భావిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ పక్కన నటించిన ముగ్గురు కుర్ర హీరోయిన్ల కెరీర్ మటాష్ అయ్యింది. పవన్ పక్కన పవన్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆ సినిమా వారికి ఎంత మాత్రం ఉపయోగపడలేదు.
మరి ఆ సినిమా ఏంటి ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం .. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన పింక్ సినిమాకు రీమేక్. బాలీవుడ్ లో అమితాబచ్చన్ తాప్సి నటించిన ఇదే సినిమా తమిళంలో అజిత్ – శ్రద్ధ శ్రీనాథ్ కాంబినేషన్లో తెరకెక్కింది. అప్పటికి రెండు భాషలలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం అంటే కత్తి మీద సామి లాంటిదే.. కానీ పవన్ వెంటనే డేట్లు ఇవ్వడంతో అప్పటికప్పుడు కథలేక దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేసే రిస్క్ చేశారు.
ఈ సినిమాలో అనన్య నాగళ్ళ – అంజలి – నివేద థామస్ ముగ్గురు నటించారు. పవన్ సినిమాలో ఛాన్స్ అనగానే ఈ ముగ్గురు కుర్ర హీరోయిన్లు ఎగిరి గంతేశారు. అంజలి ఎప్పటినుంచో హీరోయిన్గా చేస్తున్న అనుకున్న స్థాయిలో స్టార్డం రాలేదు. ఇక నివేద థామస్ కు జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తర్వాత పెద్ద సినిమా పడలేదు. పవన్ వకీల్‌సాబ్ సినిమాపై నివేదా పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. అలాగే కొత్త అమ్మాయి అనన్య నాగళ్ళకు పవన పక్కన ఛాన్స్ అనగానే ఎక్కడా లేని ఆనందం వచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడిన ఈ ముగ్గురు హీరోయిన్ల కెరీర్ కు ఎంత మాత్రం ఉపయోగపడలేదు అని చెప్పాలి.