Moviesఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న సూర్య .. ఇక బాలీవుడ్ హీరోలకు దబిడి...

ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న సూర్య .. ఇక బాలీవుడ్ హీరోలకు దబిడి దిబిడే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూట్‌లో నడవడానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెడీ అయ్యాడా? అంటే అవుననే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి సినీ కెరియర్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక పోలిక ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్టీఆర్ దేవర సినిమాకు నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు ఇప్పుడు వారందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు ..

సూర్య బలం.. సూర్యకు తెలుస్తోందా?

నార్త్ జనాలు దేవరను , బాగా ఆదరిస్తున్నారు తారక్ నటనకి, జాన్వి అపీరియన్స్, సైఫ్ విలనిజం ఇలా ప్రతిదీ వారిని ఆకట్టుకున్నాయి. ఇలా ఎన్టీఆర్ తన నటనతో ఎవరినైనా మెప్పించగలరని వార్‌2 కోసం ఆయనను సెలెక్ట్ చేసుకున్నారని కాన్ఫిడెన్స్ గట్టిగా కనిపిస్తుంది.. 2025లో వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఎలా పోటీ పడతాడో చూడడానికి నార్త్ ఆడియన్స్ తో పాటు సౌత్ వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jr NTR Believes This Actor Is The Most Handsome Of His Generation - News18

బాలీవుడ్ పై విలన్గా తన హీరో విజయంతో ఎంతో స్ట్రాంగ్ అవుతున్న ఈ సమయంలో సౌత్ నుంచి మరో హీరో పేరు కూడా విలన్ గా వినిపిస్తోంది. ధూమ్‌ 4లో రణ్‌బీర్‌ కపూర్‌కి విలన్‌గా సూర్యని అనుకుంటున్నారు. నవంబర్‌లో కంగువతో మెప్పించడానికి రెడీ అవుతున్నారు సూర్య. విలనిజం సూర్యకి కొత్తేం కాదు. ఆయన సినిమాల్లోనే కాదు, పొరుగు సినిమాల్లోనూ చేసి మెప్పించారు. ఆ మధ్య ఆయన చేసిన రోలెక్స్ కేరక్టర్‌ని జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే నార్త్ లో రణ్‌బీర్‌కి సూర్య విలన్‌ అవుతారనే వార్త ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news