ఎస్ ఇది నిజమే .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజంగానే పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు. తాజాగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నైజాంలో కేవలం మూడు రోజుల్లోనే రు. 40 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. విశాఖ ఏరియాకు రు. 12 కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ నెంబర్లు వచ్చాయంటే మొత్తం వసూళ్లు చాలా ఎక్కువే ఉంటాయి.
నైజాం రు. 60 కోట్లు దాటుతుందని .. ఏపీ కూడా రు. 60 నుంచి 70 కోట్లు ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. దేవర లెక్కలు చూసిన ఓజీ నిర్మాత డివివి దానయ్య ఓజికి కొత్త రేట్లు చెబుతున్నట్టు తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఓజీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు నిర్మాత దానయ్య రు. 110 కోట్ల వరకు చెబితే వచ్చారట. దేవర సినిమా ఏపీ – తెలంగాణ హక్కులు రు. 120 కోట్లకు అమ్మారు. ఇప్పుడు దేవర వసూళ్లు చూసిన దానయ్య ఓజి సినిమాకు కొత్త రేట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రు. 150 కోట్లు కోట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ – జనసేన కేడర్ – కూటమి ప్రభుత్వం – సుజిత్ క్రేజీ కాంబినేషన్ ఇవన్నీ కలిసి ఓజీ సినిమాను దేవరకన్నా పెద్ద హిట్ చేస్తాయని .. అందువల్ల 150 కోట్లు వసూళ్లు చాలా ఈజీగా వస్తాయని నిర్మాత దానయ్య బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. కానీ దేవర రెండు తెలుగు రాష్ట్రాలకు 120 కోట్లు అంటేనే చాలా మంది షాక్ అయిపోయారు. ఇప్పుడు ఓజీ రు. 150 కోట్లు చెబితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.