టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా గత నెల 27న భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2018 లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత రెండున్నర సంవత్సరాల క్రితం త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమా రామ్ చరణ్ తో కలిసి నటించిన మల్టీ స్టార్లర్ సినిమా కావడంతో పాటు ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు కావడంతో క్రెడిట్ ఎన్టీఆర్ ఖాతాలో పడలేదు.
ఇప్పుడు దేవర మామూలు కంటెంట్తో వచ్చి కూడా పాన్ ఇండియా రేంజ్ లో 10 రోజులకే ఏకంగా 470 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ పూర్తయ్యేసరికి రు. 550 కోట్ల నుంచి 600 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే నైజాంలో కేవలం పది రోజులకే దేవర రు. 48 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను దిల్ రాజు రు. 42 కోట్లకు సొంతం చేసుకున్నారు.. 10 రోజులకే ఏకంగా దిల్ రాజుకు ఏకంగా రు. 6 కోట్ల లాభం వచ్చింది.
ఇప్పటివరకు నైజంలో స్టార్ హీరోల సినిమా పంపిణీ హక్కులు 40 నుంచి 45 కోట్ల రేంజ్ లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పుడు దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూశాక ఎన్టీఆర్ నైజాం సినిమా లెక్కలు మార్చేశారు. ఇకనుంచి నైజాంలో స్టార్ హీరోలు సినిమాలు పంపిణీ చేయాలంటే రు. 50 కోట్ల పైమాటే మామూలు సినిమాకు కూడా రు. 50 కోట్ల నుంచి 60 కోట్ల రేషియోలో అమ్మకాలు సాగనున్నాయి. ఏది ఏమైనా ఒక మామూలు కంటెంట్తో వచ్చిన దేవర సినిమాతో 55 నుంచి 60 కోట్ల చేర్ కొట్టిన ఎన్టీఆర్ నైజాం బిజినెస్ లెక్కలు మార్చేసారని చర్చ ట్రేడ్ వర్గాల్లో నడుస్తోంది.