అక్కినేని నాగ చైతన్య, సమంత అంటేనే టాలీవుడ్‌లో గత పదేళ్లుగా హాట్ టాపిక్.. చాలా సీక్రెట్‌గా కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత ప్రేమించుకున్న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. పెళ్లికి ముందు వీరు చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. పెళ్లి తర్వాత కూడా మజిలీ సినిమా చేస్తే సూపర్ హిట్ అయ్యింది. మరీ ముఖ్యంగా సమంత తొలి సినిమా ఏ మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడిపోయింది.
పెళ్లికి ముందు వీరు ఏ మాయ చేశావే – ఆటోనగర్ సూర్య – మనం ఆ తర్వాత ఓ బేబీ, మజిలీ, జాను సినిమాలు వచ్చాయి. ఇక వీరి మధ్య మనస్పర్థలకు చాలా కారణాలే ఉన్నాయన్న గుసగుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ డిజాస్టర్ సినిమా కూడా వీరిద్దరి మధ్య మనస్పర్థలకు కారణమైందంటున్నారు. తమిళంలో త్రిష కృష్ణన్ – విజయ్ సేతుపతి కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ 96 ని దిల్ రాజు ఇక్కడ తిరిగి రీమేక్ చేశాడు.
ఈ సినిమా రైట్స్ కొన్న దిల్ రాజు – నాగచైతన్య .. సమంతలతో తీయాలనుకున్నారు. అయితే చైతుకు ఈ సినిమా కథ నచ్చలేదట. దిల్ రాజు నిర్మాత అయినా ఒప్పుకోలేదు. కానీ, సమంత జానూ సినిమా చేయడానికి ఒకే చెప్పింది. నాగ చైతన్య ఈ సినిమా వద్దని చెప్పినా వినకుండా కమిట్ అయ్యింది. చివరకు ఈ సినిమాలో హీరోగా చైతు ప్లేస్‌లో శర్వానంద్ వచ్చి చేరాడు. సినిమా అవుట్ ఫుట్ చూశాక దిల్ రాజుకు రిజల్ట్‌పై క్లారిటీ వచ్చిందట.
అక్కడ సమంత హీరోయిన్‌గా కూడా ఉన్నా ప్రమోషన్లు చేయకుండా గాలికి వదిలేశారు. ఫైనల్ గా నాగ చైతన్య జడ్జ్‌మెంట్ నిజమైంది. అలా ఈ సినిమాతోనే వీరి మధ్య మనస్పర్తలు మొదలయ్యాయని అంటారు.