టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో అతడు నటించిన సినిమాలను చూసుకుంటే ఒక సినిమా హిట్ అయితే.. ఆ తర్వాత సినిమా ప్లాప్ అయ్యేది. ఆ తర్వాత ఒకటి హిట్టయితే రెండు ప్లాప్ అయ్యేవి. ఇలా మహేష్ సినీర్ కెరీర్ పడుతూ.. లేస్తూ.. కొనసాగేది. అయితే చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుకు వరుసగా దూకుడు, బిజినెస్‌మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో మూడు వరుస హిట్లు దక్కాయి. ఆ తర్వాత మళ్లీ వన్ నేనొక్కడినే, ఆగడు లాంటి రెండు డిజాస్టర్ సినిమాలు.. ఆ వెంటనే శ్రీమంతుడు హిట్టైనా.. స్పైడర్ మళ్ళి డిజాస్టర్ అయింది.
మళ్ళీ భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టాడు. పోకిరి తర్వాత మహేష్ నటించిన సైనికుడు భారీ డిజాస్టర్ కావడంతో.. ఆ తర్వాత సురేందర్ రెడ్డి అతిధి సినిమా చేశారు. ఆ సినిమాతో టాలీవుడ్‌కి అమృత రావు హీరోయిన్గా పరిచయమైంది. ఈ బ్యూటీ మహేష్‌కి తెగ నచ్చేసింది. కావాలని మహేష్ కోరుకోవడంతో పట్టుబట్టి అమృత రావ్‌ని ఈ సినిమాలో హీరోయిన్గా నటింపజేశారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా డిజాస్టర్ కావడంతో అమృతారావు మళ్ళీ కనిపించలేదు.
బాలీవుడ్‌లో వివాహాహ్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలు చేసింది. అక్కడ అమృతకు మంచి ఇమేజ్ ఉంది. మహేష్ బాబు పక్కన సినిమా ఛాన్స్ అనగానే ఆమె ఎగిరిగెంతేసింది. ఈ సినిమా ప్లాప్ కారణంగా అమృతా రావుకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అదే అతిధి సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉంటే తెలుగులో కూడా అమృతకు మంచి మంచి అవకాశాలు వచ్చేయి. అలా మహేష్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ఆమెకు ఇక్కడ కాలం కలిసి రాలేదు.