సినిమా : లక్కీ భాస్కర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్ – మీనాక్షి చౌదరి – రాంకీ – మానస చౌదరి – హైపర్ ఆది – సూర్య శ్రీనివాస్ తదితరులు.
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : నిమేష్ రవి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య
రచన – దర్శకత్వం : వెంకీ అట్లూరి
రిలీజ్ డేట్ : 31 అక్టోబర్, 2024
దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ కి ముందే మంచి అంచనాలు తెచ్చుకుంది. రిలీజ్ కు ఒక రోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాలలో 150 కి పైగా థియేటర్లలో ప్రీమియర్ షోలు కూడా వేశారు. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.
కథ లోకి వెళదాం….
ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది. భాస్కర్ కుమార్ ( దుల్కర్ సల్మాన్ ) మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి. చాలీచాలని జీతం దానికి తోడు కుటుంబం మొత్తం అతని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. భార్య సుమతి ( మీనాక్షి చౌదరి ) తో పాటు కొడుకు.. తండ్రి.. చెల్లి.. తమ్ముడు ఇలా అందరి బాధ్యతలు మోస్తూ దొరికిన చోట అప్పులు చేస్తూ ఉంటాడు. మంచి ఉద్యోగి అన్న పేరు ఉన్న ప్రమోషన్ రాదు. ఈ టైంలో కుటుంబం కోసం చేసిన రిస్క్ తో కష్టాల్లో పడతాడు.. చివరకు ఏం ? జరిగింది అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ :
చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై ఓ సరికొత్త నేపథ్యం ఆవిష్కరించిన సినిమా ఇది. బ్యాంకింగ్ వ్యవస్థ.. స్టాక్ మార్కెట్.. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయో అని చూపిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. 90లో భారతీయ ఆర్థిక వ్యవస్థని కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణం ఈ కథలో కీలకం. సినిమాలో కథ పాత్రలు తెరపై సంఘటనలు అన్నీ కూడా ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యేవి. భాస్కర్ కుటుంబానికి అవమానాలు జరగటం.. అప్పటినుంచి కథలో గాఢత పెరుగుతుంది. భాస్కర్ పై జాలి కలిగేలా చేసిన దర్శకుడు ఆ తర్వాత తను ఏదో ఒకటి చేసి సమస్యల నుంచి గట్టు ఎక్కాలనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగించాడు తెరపై అంతా ఊహించినట్టే జరుగుతున్న అక్కడక్కడ కథని మలుపులు తెప్పి ప్రేక్షకులను తిరిగి మెప్పిస్తుంది.
క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆసక్తిగా మొదలైన సెకండాఫ్ చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. అయితే షేర్లు.. మాయాజాలం.. స్టాక్ మార్కెట్.. కుంభకోణాలు అంటూ కాస్త లోతైన అంశాలు దర్శకుడు చెప్పినా అవి సామాన్య ప్రాక్షకుడికి ఓ పట్టాణ అర్థం కావు. భాస్కర్ లో డబ్బు తీసుకువచ్చిన మార్పు.. ఆ నేపథ్యంలో సాగే కథనం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి రచన సినిమాని మరో స్థాయికి తీసుకు వెళుతుంది.
నటీనటుల పనితీరు…
దుల్కర్ సల్మాన్ సినిమా అంతా తన భుజాలపై మోసాడు. ప్రతి సన్నివేశం మనోడి చుట్టూ తిరుగుతుంది.. మధ్య తరగతి ఫ్యామిలీ మెన్ గా పాత్రలో ఒదిగిపోయాడు. మీనాక్షి చౌదరికి మంచి పాత్ర దక్కింది. అందంగా కనిపిస్తూ భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో బాగా నటించింది. మిగిలిన నటీనటులు పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.
టెక్నికల్ గా చూస్తే..
సినిమా చాలా బాగుంది.. జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు కథకు తగినట్టుగా ఇమిడిపోయాయి. కెమెరా వర్క్ బాగుంది. వెంకీ అట్లూరి రచన సినిమాపై చాలా ప్రభావం చూపించింది.. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. కథా నేపథ్యం.. దుల్కర్ సల్మాన్ నటన.. మీనాక్షి చౌదరి అందచందాలు సినిమాలో వచ్చే ట్విస్టులు, సంగీతం ప్రధాన బలాలు. అయితే ద్వితీయార్థంలో సాగదీసిన సన్నివేశాలు కాస్త మైనస్. ఓవరాలకు లక్కీ భాస్కర్ గేమ్ అదిరిపోయింది.
ఫైనల్ పంచ్ : లక్కీ భాస్కర్ హిట్‌తో లక్కీ కొట్టాడు…
లక్కీ భాస్కర్ రేటింగ్ : 3.5 / 5