టాలీవుడ్ లో నాగచైతన్య – సమంత జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ జంట. అయితే పెళ్లి తర్వాత కొన్ని రోజులకే మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకుని వీరిద్దరూ విడిపోయిన అప్పటికి కూడా వీరికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే వస్తుంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సమయం కన్నా విడిపోయిన తర్వాత ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్టు శోభిత ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని బట్టి వీరి పెళ్లి తేదీ కూడా దగ్గరలోనే ఉందని కూడా తెలుస్తుంది.
అయితే సరిగ్గా ఇలాంటి సమయంలో నాగచైతన్యకు సమంత షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. విరుద్దరు పెళ్లి చేసుకుని కలిసి ఆనందంగా ఉన్న సమయంలో నాగచైతన్య – సమంత కలిసి ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసే సమయంలో నాగచైతన్య కన్నా సమంతా ఎక్కువ ఖర్చు పెట్టానని అంటుంది. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించి ఆ తర్వాత చైతూకు లీగల్ నోటీసులు పంపించబోతుందట. దీనికి కారణం ఏమిటంటే పెళ్లి తర్వాత నాగచైతన్య శోభిత తో ఆ ఫ్లాట్లోనే కాపురం పెట్టబోతున్నారట. ఈ విషయంపై శోభిత ఒప్పుకోలేదని కూడా అంటున్నారు. అందులో ఉండటం వల్ల పదే పదే మీ పాత బార్య జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని వేరే ఫ్లాట్లో ఉందామని చెప్పిందట.
అయితే నాగా చైతన్య మాత్రం అందులోనే ఉందామని ఎంతో ఇష్టపడి ఇంటీరియల్ చేయించానని చెప్పడంతో ఈ విషయంలో నాగచైతన్య – శోభిత మధ్య చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయని అంటున్నారు. అయితే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంటుందట. అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ ను శోబితకు గిఫ్ట్ గా రాయాలని నాగచైతన్య చూస్తున్నట్టు తెలిసింది.. తాను అధికంగా ఖర్చుపెట్టిన ఆ ఫ్లాట్ ను వేరే వారికి బహుమతిగా రాసిస్తానంటే ఎలా ఒప్పుకుంటానని సమంత తన సన్నిహితులతో అంటున్నట్లు సమాచారం. అందుకే నాగా చైతన్య- శోభిత పెళ్లికి సమంత కోర్టు ద్వారా అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వటానికి రెడీ అ అయిందట.