Moviesప్ర‌భాస్ పెళ్లిపై క‌న‌క‌దుర్గ‌మ్మ సాక్షిగా అప్‌డేట్ వ‌చ్చేసింది ...!

ప్ర‌భాస్ పెళ్లిపై క‌న‌క‌దుర్గ‌మ్మ సాక్షిగా అప్‌డేట్ వ‌చ్చేసింది …!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగేలేని స్టార్ హీరోగా ఉన్నారు. బాహుబలి 1, బాహుబలి 2 లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌ సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కి సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ స్టామినాను మరోసారి చాటి చెప్పాయి. ప్రస్తుతం ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత స్పిరిట్ సినిమా లైన్‌లో ఉంది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? జరుగుతుంది అన్న ప్రశ్నకు గత పది సంవత్సరాల నుంచి రకరకాల వార్తల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Prabhas Donates Generously To TFDA | cinejosh.com

కృష్ణంరాజు బతికి ఉండగానే ప్రభాస్ పెళ్లి చేయాలని అనుకున్న కుదరలేదు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి.. ప్రభాస్ పెద్దమ్మ అయినా కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ఎన్నో సందర్భాల్లో చెబుతున్నారు. తాజాగా దసరా ఉత్సవాల సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న శ్యామల దేవి.. ప్రభాస్ పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభాస్ కు పెళ్లి జరుగుతుందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు, కృష్ణంరాజు గారు ఆశీస్సులు బాబుపై ఎప్పుడు ఉంటాయి.

జనసేన పార్టీలోకి కృష్ణంరాజు భార్య..?

త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుంది. మీరందరూ చూస్తారు. ఆరోజు అందరిని ఆహ్వానిస్తాం అని శ్యామలాదేవి తెలిపారు. మధ్యలో మూడు వరుస ప్లాపులతో ప్రభాస్ కెరీర్ కాస్త డల్ అయినట్టు కనిపించినా.. ఇప్పుడు సలార్, కల్కి రూపంలో రెండు సూపర్ హిట్‌లు పడటంతో ప్రభాస్ మళ్ళీ కెరీర్ పరంగా ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభాస్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఒక ఇంటివాడు అయితే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అయినా ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news