టాలీవుడ్ యంగ్‌టైగర్… మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దేవర. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రు. 500 కోట్ల వసూళ్లు సాధించి లాంగ్ రన్‌లో రు. 600 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ. తెలంగాణలో అయితే దేవర ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. ఇక దసరా సెలవులు కూడా రావడంతో ప్రేక్షకులు అయితే థియేటర్ల దగ్గరకు ఇప్పటకీ క్యూ కడుతూనే ఉన్నారు.
ఇక దేవర సినిమా ఎండింగ్ లో చాలా ట్విస్టులు ఇస్తూ అసంపూర్తిగా వదిలేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇక దేవర 2 కూడా వచ్చే యేడాది ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళుతుందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. ఇక ఇప్పుడు దేవర సినిమా చూసిన చాలా మందికి దేవర 2 మాత్రమే కాదు.. దేవర 3 కూడా ఉంటుందన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయితే దీనిపై కొరటాల శివ పక్కాగా క్లారిటీ ఇచ్చేశాడు. దేవర లాంటి సినిమాను నిజానికి ఒకే కథగా తీయాలి.. కాని సినిమాలోని పాత్రలు ఎస్టాబ్లిష్ చేస్తూ.. వాటి ప్రాధాన్యత తెలిపేందుకు ఈ సినిమాను రెండు పార్టులుగా తీయక తప్పట్లేదు.. దేవర 2 తోనే కథను ఎట్టి పరిస్థితుల్లోనూ ముగించేయాల్సి వస్తోంది. దేవర 3 అంటూ మళ్లీ కథను పొడిగిస్తే ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తి తగ్గించినట్లవుతుందని కొరటాల తెలిపారు. ఆయన కామెంట్స్‌ను బట్టి దేవర 3 ఉండదని క్లారిటీ వచ్చేసింది.