చాలామంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు అయిపోతారు. మరి ముఖ్యంగా 1990 – 2000 వరకు హీరోయిన్లు తక్కువగా ఉండేవారు కాబట్టి ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన వారికి చాలా గుర్తింపు ఉండేది. వాళ్ళు ఒకటి రెండు సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ప్రేక్షకుల మదిలో అలా ఉండిపోయేవారు. అలాంటి వారిలో రేఖ వేదవ్యాస్ ఒకరు. ఉషాకిరణ్ పై శ్రీనును వైట్ల దర్శకత్వంలో ఆకాష్ హీరోగా తర్కెక్కిన ఆనందం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది రేఖ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ – తమిళ – హిందీ భాషలలో కూడా నటించింది.
40 ఏళ్ళు దాటిన ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ముంబైలో తన తల్లితో కలిసి ముంబై లో ఉంటుంది. రేఖ అసలు పేరు అక్షర .. కన్నడ భాషలో చిత్ర అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె తొలి సినిమా ఆనందం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రేఖకు వరుసగా ఆఫర్లు తలుపులు తెచ్చాయి. ఇలా ఆఫర్లు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడంతో ఇక్కడ దర్శక నిర్మాతలు … హీరోలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆఫర్లు ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే రేఖ గతంలో టాలీవుడ్ హీరో రోహిత్తో ప్రేమలో ఉందనే వార్త అప్పట్లో టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో జోరుగా వినిపించింది. వీరి కాంబినేషన్లో అనగనగా ఓ కుర్రాడు సినిమా వచ్చింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే టాక్ ఉంది. ఆ తర్వాత రేఖ మీద ప్రేమతోనే రోహిత్ తాను హీరోగా చేసిన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో స్నేహితురాలి పాత్ర ఇచ్చారనే టాక్ కూడా ఉంది. అయితే ఇక్కడే ట్విస్ట్ కూడా ఉంది. రేఖ గాఢంగా ప్రేమించిన హీరో కన్నడ నటుడు గణేష్..రేఖ గణేష్ కాంబినేషన్లో కన్నడలో కొన్ని సినిమాలు వచ్చాయి. గణేష్ రేఖను మోసం చేశాడని అంటారు. ఇటు రేఖని ప్రేమిస్తూనే మరోవైపు వేరే అమ్మాయిని ప్రేమించి రాత్రికి రాత్రే సీక్రెట్ గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తో రేఖ ప్రేమలు.. పెల్లి పై నమ్మకం పోయి అలా సింగిల్ గానే ఉందంటారు.