నటసింహం నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కోసం ఆ అభిమానులు ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా – లెజెండ్ – అఖండ సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం కోసం నాలుగో సారి చేతులు కలిపారు. ఇటీవల ఈ సినిమా హైదరాబాదులో ప్రారంభోత్సవం జరుపుకోవడంతో పాటు టైటిల్ టీజర్ కూడా ఆవిష్కరించారు. టీజర్ టైటిల్ తోనే ఇది పాన్ ఇండియా సినిమా అని క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా అన్ని ప్రధాన భారతీయ భాషలలో అఖండ 2 తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు నార్త్ లో అద్భుతమైన ఆదరణ వచ్చింది.
ఓటీటీలో విడుదలైన తర్వాత అఖండ హిందీ వెర్షన్ బాగా ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అఖండ 2 తప్పకుండా హిందీ మార్కెట్లో సంచలనం క్రియేట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అఖండ 2 తాండవం యూనివర్సిటీ లైఫ్ తరహా పవర్ఫుల్ స్క్రిప్ట్. ఇందులోను బాలయ్య పోషించే అఘోర పాత్ర హైలెట్ అవుతుందని అంటున్నారు.అఖండ 2 తాండవం సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సంతోష్ డి డెటాకే & సి రాంప్రసాద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తోన్న 109వ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అఖండ 2 సెట్స్ మీదకు వెళుతుంది.