Moviesఅతని పేరు చెప్తే ప్రాణమిస్తారు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో పవర్ఫుల్.. ఇంతకీ...

అతని పేరు చెప్తే ప్రాణమిస్తారు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో పవర్ఫుల్.. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..!?

సోషల్ మీడియాలో ప్రస్తుతం సినిమా హీరోలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతూ వస్తుంది .. ఇక వారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పన అక్కర్లేదు నిత్యం ఏదో ఒక వార్త ఇక్కడ వింటూనే ఉన్నాం. కానీ ఈ రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో నలిన‌టుల‌ చిన్నప్పుడు ఫోటోలు బాగా వైరల్ చేస్తూ వస్తున్నారు అభిమానులు. యంగ్ హీరోలు . హీరోయిన్లు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు , హీరోయిన్ల చిన్నప్పటి జ్ఞాపకాల‌న్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇప్పుడు పైన ఫోటోలు కనిపిస్తున్న బుడ్డోలలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. అతని పేరు చెబితే అభిమానులకు పూనకాలే.. సినిమా రిలీజ్ అయింది అంటే థియేటర్ల వద్ద పండగే మన తెలుగు రాష్ట్రాల్లో అతనికి భారీగా అభిమానులు కూడా ఉన్నారు అతడి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Pawan Kalyan to star in Bollywood film of Christ's life | Bollywood | The  Guardian

అత‌ను నటించిన సినిమాలు ఎప్పుడు విడుదలవుతుందాని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు . ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నటించే సినిమాలు పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంతకీ ఆ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన తెలుగు చిత్ర పరిశ్రమల్లో పవన్ కళ్యాణ్ పేరు చెబితే వచ్చే క్రేజ్ ఎలాంటిదో పెద్దగా చెప్పక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కా సినిమాల్లో అడుగుపెట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్ ఆ తర్వాత గోకులంలో సీతా , సుస్వాగతం వంటి సినిమాలో నటించి వరుస విజ‌య‌లు అందుకున్నాడు.

Pawan Kalyan Latest Health Update: Stable in Hospital, Being Treated For  Phlegm in Lungs

అలాగే తొలిప్రేమ సినిమాతో పవన్ కెరియర్ ఊహించిన విధంగా మారింది. ఆ తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ వంటి వరుస‌ సినిమాలతో టాలీవుడ్ లోనే పవర్ స్టార్ గా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన పవన్.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వీలు చూసుకుని తన సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news