Movies ర‌త్న‌వేలు వ‌ర్క్ ఎన్టీఆర్‌కు న‌చ్చ‌లేదా... ' దేవ‌ర 2 ' కు...

 ర‌త్న‌వేలు వ‌ర్క్ ఎన్టీఆర్‌కు న‌చ్చ‌లేదా… ‘ దేవ‌ర 2 ‘ కు వ‌ద్ద‌ని కొర‌టాల‌కు చెప్పేశాడా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా.. తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దేవర సినిమా కంటెంట్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ కాస్త పొట్టిగా కనిపిస్తున్నాడు అన్న కంప్లైంట్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. నిజానికి ఎన్టీఆర్ మరి అంత పొట్టి కాదు. పైగా.. సినిమాటోగ్రాఫర్ తలుచుకుంటే అటూ, ఇటూ సవరించడం.. దాన్ని సరి చేయడం.. చాలా కామన్. కానీ.. దేవర సినిమాలో అలా జరగలేదు. సినిమా విడుదలకు ముందు కూడా దీనిపై చాలా కంప్లైంట్లు నడిచాయి.

Devara: Part 1 - Wikipedia

రత్నవేలు బాగా పేరు ఉన్న సినిమాటోగ్రాఫర్. చాలా మంచి ప్రాజెక్టులు చేసినవాడు. ఎందుకో దేవర విషయంలో పూర్తి టాలెంట్ ప్రదర్శించినట్టు కనిపించలేదు అన్న చర్చలు నడిచాయి. సినిమా ధియేటర్లలో రిలీజ్ అయ్యాక.. ఎన్టీఆర్ చాలా పొట్టిగా కనిపిస్తున్నాడు అన్న కంప్లైంట్లు ఎన్టీఆర్ చెవిలో పడ్డాయి. ఎన్టీఆర్ కూడా దీని నుంచి పలు కోణాలలో ఫీడ్‌బ్యాక్ తెప్పించుకున్నారు. అంతే రత్నవేలు విషయంలో ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కు హిందీ కమిట్మెంట్లు చాలా ఉన్నాయి.

DEVARA 2 - NTR Intro First Look Teaser|Devara 2 Official Teaser|Devara 2  Trailer|Devara 2|NTR|Janvi

వార్ 2 సినిమా చేస్తున్నాడు. తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమా ఉంది. ప్రశాంత్ నీల్‌ వేగంగానే సినిమా తీస్తారు. అలాగే ఎన్టీఆర్ కూడా చాలా వేగంగానే చేస్తారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన వెంటనే దేవర 2కు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది చివర్లో దేవర 2 ప్రాజెక్టు ప్రారంభిద్దామని ఎన్టీఆర్.. కొరటాలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దేవర 2 సినిమాకు మాత్రం రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా వద్దని ఎన్టీఆర్ తేల్చి చెప్పారట. దేవరలో ఎన్టీఆర్ 2 ఫ్రేమ్‌ల మీద ఉన్న అసంతృప్తి కారణంగానే రత్నవేల్‌ను ఎన్టీఆర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే రత్నవేలు ఈ మధ్యలో బుచ్చిబాబు సనా – రామ్ చరణ్ సినిమాకు బిజీగా పని చేస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news