Movies' దేవ‌ర ' 4 వ రోజు అదే రోజు.. తార‌క్...

‘ దేవ‌ర ‘ 4 వ రోజు అదే రోజు.. తార‌క్ రికార్డుల హోరు…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా కూడా రెండో రోజు నుంచి దేవ‌ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. వ‌సూళ్ల వీరంగం ఆడేస్తోంది. ఇక తొలి మూడు రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 304 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా నాలుగో రోజు కూడా ఏపీ, తెలంగాణ‌లో రు. 5.40 కోట్ల వ‌సూళ్లు సాధించింది.

Devara Movie Review: A Grand Scale Action Film - Telugu 360

ఇక ఏపీ, తెలంగాణ వ‌ర‌కు రు. 113 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన దేవ‌ర 4 రోజుల్లో రు. 93 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మ‌రో రు. 20 కోట్ల షేర్ వ‌స్తే ఏపీ, తెలంగాణ వ‌ర‌కు దేవ‌ర బ్రేక్ ఈవెన్ అయిపోయిన‌ట్టే. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రు. 185 కోట్ల షేర్ వ‌స్తే బ్రేక్ ఈవెన్ అయిపోయిన‌ట్టే.

నైజాం – 2.34 కోట్లు
సీడెడ్ – 1.28 కోట్లు
వైజాగ్ – 0.52 కోట్లు
ఈస్ట్‌ – 0.23 కోట్లు
వెస్ట్ – 0.21 కోట్లు
కృష్ణా – 0.28 కోట్లు
గుంటూరు – 0.31 కోట్లు
నెల్లూరు – 0.23 కోట్లు
—————————————–
డే 4 మొత్తం కలెక్షన్స్: 5.40 కోట్లు
——————————————

Devara X Review: Netizens Praise Jr NTR-Saif Ali Khan's Fight Scenes, Call  The Film 'Next Baahubali' | Republic World

ఏరియా వైజ్ టోట‌ల్ 4 డేస్ క‌లెక్ష‌న్స్ :నైజాం – 35.38 కోట్లు
సీడెడ్ – 19.41 కోట్లు
వైజాగ్ – 9.63 కోట్లు
ఈస్ట్ – 6.17 కోట్లు
వెస్ట్ – 4.91 కోట్లు
కృష్ణా – 5.49 కోట్లు
గుంటూరు – 8.44 కోట్లు
నెల్లూరు – 3.66 కోట్లు
————————————————-
మొత్తం 4 రోజుల కలెక్షన్ – 93.09 కోట్లు
————————————————-

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news