Moviesమండే టెస్ట్ పాస్ అయిన ' దేవ‌ర ' ... బ్రేక్...

మండే టెస్ట్ పాస్ అయిన ‘ దేవ‌ర ‘ … బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర్లో…!

మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ .. యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా దేవ‌ర‌. భారీ అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన దేవ‌ర సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 172 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇక మూడు రోజుల‌కు రు. 304 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 250 కోట్ల వ‌ర‌కు గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని చెపుతుంటే .. మేక‌ర్స్ మాత్రం మ‌రో రు. 50 కోట్లు క‌లిపార‌న్న సందేహాలు ట్రేడ్ వ‌ర్గాల్లోనే ఉన్నాయి.

Devara: Part - 1 Movie Review: Jr NTR shines in a visually stunning yet  predictable action drama

ఇక మండే టెస్ట్ దేవ‌ర పాస్ అయిపోయింది. అటు ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే 4.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన దేవ‌ర 4వ రోజు కూడా స‌క్సెస్ ఫుల్ వ‌సూళ్లు అందుకుంది. ఇక నాల్గో రోజు నైజాంలో దేవ‌ర సాలిడ్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. దేవ‌ర నాలుగో రోజు 2.3 కోట్ల షేర్ అందుకోగా… మొత్తం నాలుగు రోజుల్లో 35.38 కోట్ల షేర్ దేవ‌ర అందుకుంది. ఇక నాలుగో రోజు కూడా దేవర సాలీడ్ ర‌న్‌తో దూసుకు పోతోంద‌ని చెప్పాలి.

North America BO: Where is Devara Heading? - TeluguBulletin.com

ఇక నైజాంలో దేవ‌ర సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ సినిమాను రాజు రు 42 కోట్ల‌కు కొన్నారు. ఇప్ప‌టికే రు. 36 కోట్ల షేర్ అంటే.. మ‌రో రు. 6 కోట్ల షేర్ అక్క‌డ ఈజీగా వ‌చ్చేస్తుంది. ఏదేమైనా దేవ‌ర నైజాంలో.. అటు ఓవ‌ర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు అతి ద‌గ్గ‌ర‌లో ఉంది. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌.. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించారు. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 185 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news