టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా తెరకెక్కిన సినిమా దేవర. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై బాక్సాఫీస్ దగ్గర మామూలు అంచనాలు లేవు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అదరగొట్టేసాడు. పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన దేవర సాధించిన విజయానికి దేవర సాధించిన వసూళ్లకు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రు. 185 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగిన దేవర ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రు. 500 కోట్ల గ్రాస్ వసూళ్ల కు చేరువయ్యింది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అందరినీ కాస్త అయోమయంలోకి నెట్టేసింది.
ఈ సినిమాలో దేవర పాత్రను తన కొడుకు చంపుతాడు అన్నది తెలిసిందే. అయితే, అసలు దేవరను తన కొడుకు ఎందుకు ? చంపాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న అయ్యింది. ఇప్పుడు. ఇదే ప్రశ్నపై దర్శకుడు కొరటాల శివ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. దేవరను చూస్తూ, ఆయన కథలు వింటూ పెరిగిన కొడుకు చివరకు తన తండ్రినే ఎందుకు చంపాడు.. ఈ కథ ఏంటి ? అన్నది పెద్ద సస్పెన్స్ డా మారింది. అసలు ఇలా ఎందుకు చంపాడు ? అనేది ఓ దర్శకుడిగా కంటే రైటర్‌గా చాలా ఎంజాయ్ చేశాను.
దేవర కొడుకు ఎలాంటి కథను రాస్తున్నాడో ఎవరికీ తెలియదని కొరటాల చెప్పాడు. ఇక ఇది ఒక ఎమోషనల్ అడుగుగా నిలిచింది. అతడు రాసే కథ కొన్ని తరాలకు వరంగా మారిందనే చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లుగానే చెప్పాలి. ఇలాంటి డ్రామాను ఓ రైటర్‌గానే తాను బాగా ఎంజాయ్ చేశానని.. దీనికి సంబంధించిన అసలు కథ తెలియాలంటే దేవర 2 సినిమాను చూడాల్సిందే అని కొరటాల చెపుతున్నారు. ఇక వార్ 2, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 పట్టాలు ఎక్కనుంది.