నందమూరి నటసింహ బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత నాలుగైదు సంవత్సరాలుగా బాలయ్య తన వారసుడిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఏడాది మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయింది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యు మూవీ ఫిక్స్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ప్రస్తుతం మోక్షజ్ఞ డాన్సులు.. ఫైట్లలో శిక్షణ పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే తొలి సినిమాతోనే మోక్షజ్ఞ అతిపెద్ద రిస్క్ చేస్తున్నాడు అన్న చర్చలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్తోనే ఈ సినిమా తెరకెక్కనుందట. అదే జరిగితే మోక్షజ్ఞ ముందు అతి పెద్ద టార్గెట్ ఉన్నట్టు అవుతుంది.
సినిమా హిట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కానీ మోక్షజ్ఞ నందమూరి బ్యాక్గ్రౌండ్తో పాటు.. ఇటు బాలయ్య వారసత్వాన్ని తన భుజస్కంధాల మీద మోస్తూ సినిమా రిలీజ్ టైంకు మంచి హైప్ తేవాల్సి ఉంటుంది. రు. 100 కోట్ల షేర్ అంటే రు. 250 కోట్ల రేంజ్ గ్రాస్ రావాలి… ఏదేమైనా మోక్షజ్ఞ తొలి సినిమాకే మైథాలజీ సబ్జెక్ట్ ఎంచుకోవడమే గ్రేట్ అనుకుంటే… రు. 100 కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు.