Moviesబాల‌య్య - స‌న్నీడియోల్ - గోపిచంద్ మ‌లినేని... కాంబినేష‌న్ అదిరిపోలే...?

బాల‌య్య – స‌న్నీడియోల్ – గోపిచంద్ మ‌లినేని… కాంబినేష‌న్ అదిరిపోలే…?

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్లో తన 109వ సినిమాని దర్శకుడు బాబి ద‌ర్శ‌క‌త్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య వరుసగా అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్‌ కేసరి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో తిరుగే లేని ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే బాబి దర్శకత్వంలో నటిస్తున్న 109వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా టీజర్ ని దీపావళి కానుకగా అందిస్తామని నిర్మాత నాగ వంశీ తెలిపారు. అదే రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పారు.Balakrishna - Sunny Deol : బాలీవుడ్ స్టార్ తో బాలయ్య.. మాస్ ఫీస్ట్ అంటూ.. |  Balakrishna meets bollywood star sunny deol in movie sets photos goes  viral-10TV Teluguఇదిలా ఉంటే బాలయ్య లేటెస్ట్ గా ఓ సినిమా టీం ని స‌ర్ ప్రైజ్ చేశారు. బాలయ్యతో గత ఏడాది సంక్రాంతి వీర సింహారెడ్డి అనే భారీ హిట్ సినిమా దర్శకుడు గోపీచంద్ మ‌లినేని తెరకెక్కించారు. చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమా కు పోటీగా వచ్చి కూడా వీరసింహారెడ్డి కలెక్షన్ల పరంగా దుమ్ము రేపేసింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 54 కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లో నిలిచిపోయింది.ఇప్పుడు గోపీచంద్ మలినేని … బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌ కాంబినేషన్లో ఓ వీరమాస్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ క్రమంలోనే బాలయ్య ఆ సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్లి సందడి చేసినట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేయగా … ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. మరి బాలీవుడ్ హీరో సన్నీడియోల్తో దర్శకుడు గోపీచంద్ తో బాలయ్య ముచ్చటిస్తున్న దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ కలయిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news