Moviesమోక్ష‌జ్ఞ‌కు అమ్మ‌గా బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా హీరోయిన్‌..!

మోక్ష‌జ్ఞ‌కు అమ్మ‌గా బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా హీరోయిన్‌..!

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞ వెండి తెరమీద ఎప్పుడు హీరోగా కనిపిస్తాడా ? మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ వార్త ఎప్పుడు వస్తుందా ? అని ఎదురుచూసిన తెలుగు సినీ అభిమానులు … నందమూరి అభిమానులకు ఎట్టకేలకు ఈ ఏడాది తీపి వార్త అందింది. మోక్షజ్ఞ తొలి సినిమా ప‌ట్టాలెక్కనుంది. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ అభిమానులను పూనకాలతో ఊపేసిన యుగ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.Nari Nari Naduma Murari (1989) - IMDb

ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినిమా సర్కిల్స్‌లో చక్కెరలు కొడుతుంది. మోక్షజ్ఞ నటిస్తున్న సినిమాలో హీరో తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందంట. ఈ పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ అలనాటి హీరోయిన్ శోభన పేరు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె గతంలో నందమూరి బాలకృష్ణ తో కలిసి నారీ నారీ నడుమ మురారి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో పాటు మువ్వగోపాలుడు సినిమాలోని నటించింది.#మువ్వాగోపాలుడు || Muvva Gopaludu Telugu Full Length Movie | Nandamuri  Balakrishna | Shobana - YouTubeఇప్పుడు బాలయ్య తనయుడితో నటిస్తోంది. చాలా గ్యాప్ తరువాత శోభన టాలీవుడ్‌లో ‘కల్కి 2898 ఎడి’ సినిమాలో నటించింది. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో తల్లి పాత్రకు ఆమెను సంప్రదించడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా శోభ‌న ఉంటే సినిమాకు ఖ‌చ్చితంగా ప్ల‌స్ అవుతుంది అన‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news