నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ఈ కాంబినేషన్ కు ఉన్న స్పెషాలిటీ నే వేరు. బాలయ్యకు వరుసగా ప్లాపులు వస్తున్నాయి అనుకుంటే ఒకప్పుడు బిగోపాల్ వరుసగా సూపర్ డూపర్ హిట్లు ఇచ్చేవారు. బాలకృష్ణ కెరీర్ ను బిగోపాల్ తర్వాత ఆ స్థాయిలో తీసుకువెళ్లి శిఖరాగ్రాన కూర్చోబెట్టిన ఘనత కచ్చితంగా బోయపాటి దక్కుతుంది. సింహ – లెజెండ్ – అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు ఈ జోడి నుంచి నాలుగో సినిమా రాబోతుంది. అయితే గతంలో బాలయ్య వరుస ప్లాపులతో ఉండేవారు.. ఇప్పుడు బాలయ్య వరుస సూపర్ డూపర్ హిట్లతో మంచి జోరు మీద ఉన్నారు.
ఇక తాజాగా వీరి నుంచి వస్తున్న నాలుగో సినిమా అఖండ కథకు కొనసాగింపుగా వస్తోంది. ఆఖండకు సీక్వెల్ గా వస్తోంది. అఖండ సూపర్ డూపర్ హిట్ అయినప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని బోయపాటి ప్రకటించారు. అయితే ఇప్పుడు వీరు కాంబినేషన్ వస్తున్న నాలుగో సినిమాకు అఖండ 2 అని కాకుండా సరికొత్త టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. ఈ సినిమాకు తాండవం లేదా అఖండ తాండవం అనే టైటిల్ పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అఖండలో మాస్, యాక్షన్, హీరోయిజం ఇవన్నీ బాగా పండాయి. దానికి తోడు హిందుత్వం ఎలిమెంట్ తోడైంది. దేవాలయాల పరిరక్షణ, వాటి విశిష్టత గురించి చెప్పారు. ఇప్పుడు ఆ పాయింట్ ని మరింత విస్కృతంగా చర్చించబోతున్నారట. బాలయ్య ప్రస్తుతం బాబీతో తన 109 సినిమా చేస్తున్నారు. డిసెంబరు వరకూ ఈ షూటింగ్ ఉంది. ఆ తర్వాత బోయపాటికి పూర్తిగా డేట్లు ఇస్తారు.