Moviesఎన్టీఆర్ సినిమాలో అక్కినేని కోడ‌లు ఐటెం సాంగ్‌... అబ్బ అదుర్స్‌...!

ఎన్టీఆర్ సినిమాలో అక్కినేని కోడ‌లు ఐటెం సాంగ్‌… అబ్బ అదుర్స్‌…!

టాలీవుడ్‌లో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పదేళ్లపాటు టాలీవుడ్‌ను సింగిల్ హ్యాండ్‌తో సమంత ఏలేస్తుంది. ఒకానొక టైంలో స్టార్ హీరోల నుంచి టైర్ 2 హీరోల వరకు అందరు సమంతతో ఒక సినిమాలో నటించినా చాలు.. అన్నంత క్రేజ్ ఆమె తెచ్చుకుంది. అసలు వరుసకు బ్లాక్ బస్టర్ సినిమాల్లో సమంత వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంది. అక్కినేని ఇంటి కోడలు అయిన ఆ తర్వాత నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిన ఆమె.. సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది.

Ramayya Vasthavayya: Cast, Crew, Movie Review, Release Date, Teaser,  Trailer - Filmy Focus

ఇప్పటికీ సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. సినిమాలో నటించిన అది పెద్ద సెన్సేషనల్ అవుతుంది. విడాకులు తర్వాత కూడా సమంత యశోద, శాకుంతలం సినిమాలలో నటించింది. అలాగే విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమాలోను కనిపించి మెప్పించింది. ఇప్పటికీ సమంత ఒక సినిమాలో హీరోయిన్గా నటించిన సెన్సేషన్. మరి ముఖ్యంగా పుష్ప సినిమాలో ఆమె నటించిన ఐటెం సాంగ్ దేశాన్ని ఎంతలా షేక్ చేసిందో చూసాం.

ఈ క్రమంలోనే ఇప్పుడు సమంత ఎన్టీఆర్ కి జోడిగా ఒక ఐటెం సాంగ్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్‌లో యాక్ట్‌ చేయబోతుందట. 2026 లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ , సమంత గతంలో నటించిన సినిమాలు సూప‌ర్ క్రేజ్‌ తెచ్చుకున్నాయి. మరోసారి ఎన్టీఆర్, సమంత జోడిని వెండి తెరమీద చూడటం అంటే సినీ ప్రేక్షకులకు అంతకుమించిన ఆనందం ఉండదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news