టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవం ఉంటుంది. ఆ మాటకు వస్తే దివంగత లెజెండ్రీ హీరో ఏఎన్నార్ ఈ కుటుంబానికి బలమైన పునాది వేశారు. ఆయన అంటే భారతదేశమే గర్విస్తుంది.. అంత గొప్ప మహానటుడు.. ఆ తర్వాత ఆయన వారసుడిగా కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా కొనసాగుతూ.. ప్రస్తుతం సీనియర్ హీరోలలో ఒకరిగా ఉన్నారు.
నాగ్ తర్వాత ఆయన ఇద్దరు వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా హీరోలు అయ్యారు. వీరు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే గత ఆరేడేళ్లుగా నాగ్ ఫ్యామిలీకి అస్సలు కాలం కలిసి రావడం లేదు. నాగచైతన్య – హీరోయిన్ సమంత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత చైతు కెరీర్ అస్సలు బాలేదు.. చైతు కెరీర్ పరంగా వరుస పెట్టి డిజాస్టర్లు కొడుతున్నాడు. సమంతకు విడాకులు ఇచ్చిన చైతు సంప్రదాయ మహిళతో మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగు పెడతాడు అనుకుంటే.. మళ్లీ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నాడు.
ఇక అఖిల్‌కు తొలిగా శ్రీయా భూపాల్‌తో ఎంగేజ్మెంట్ జరగడం… పెళ్లి వరకు వెళ్లకుండానే వారు బ్రేకప్ చెప్పేసుకోవడం.. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీకి తీవ్ర అవమానం జరిగిందన్న వార్తలు తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీకే చెందిన సుప్రియ, సుమంత్ వైవాహిక జీవితాలు ఫెయిల్ అయ్యాయి. ఇక నాగార్జున నిర్మాతగా సక్సెస్ కావడం లేదు. బిగ్‌బాస్ హోస్టింగ్ చేసినా రేటింగ్ లేదు… తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణామన్ని చెప్పి ప్రభుత్వం కూల్చేసింది. ఇక నిన్నటి నుండి అక్కినేని ఫ్యామిలీ ఫై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆ కుటుంబ పరువు తీసేసినట్లైంది.
ఇలా వరుస వివాదాలు కేవలం అక్కినేని ఫ్యామిలీనే ఎందుకు చుట్టుముడుతున్నాయి… ఈ వరుస వివాదాలు వాళ్ల కుటుంబానికి శాపంలా మారాయా ? అన్న చర్చలే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.