Movies' అఖండ 2 ' ... క్రేజీ సీక్వెల్లో ఫ‌స్ట్ సీన్...

‘ అఖండ 2 ‘ … క్రేజీ సీక్వెల్లో ఫ‌స్ట్ సీన్ ఇదే…!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సింహ – లెజెండ్ ఆ తర్వాత అఖండ మూడు ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని అంచనాలు నెలకొన్నాయి. అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. అఖండ లో బాలయ్య నటన తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది. అఖండ సినిమా వచ్చినప్పటి నుంచి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా ? అని ఒక్కటే ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌ లో అఖండ 2 ? - Telugumopo - Movies and Politics

ఎట్టకేలకు అఖండ 2 తాండవం మొదలైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈ సీక్వెల్ స్టార్టింగ్ సీక్వెన్స్ పై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. అఖండ 2 కథ గురించి చిన్న లైన్ బయటికి వచ్చింది. అఖండ 2 కథ‌ అమెరికాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుందని ప్రగ్యా జైస్వాల్ పాత్ర హెల్త్ ట్రీట్మెంట్ కోసం రెండో బాలయ్య పాత్ర అమెరికా వెళ్లాల్సి వస్తుందని.. అక్కడ తెలుగు వాళ్ళపై ఎటాక్ జరిగే క్రమంలో బాలయ్య పాత్ర వారిని సేవ్ చేసేలా ఉంటుందని ఇదే సినిమా స్టార్టింగ్ అని తెలుస్తోంది.

Akhanda Movie Collections: మళ్లీ అఖండ కోసం కొత్త థియేటర్లు | Balakrishna  Akhanda Movie Records in Collection of Box Office - Tollywood News

ఈ యాక్షన్ సీక్వెన్స్ అఖండ 2 తాండవం స్టార్టింగ్ సీక్వెన్స్ అని బోయపాటి డిసైడ్ చేశారట. ఇక అఖండ 2 తాండవం సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు. సంజయ్ ఇటీవలే రామ్ హీరోగా వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. అఖండ 2 తాండవం సినిమాను 14 రిల్స్‌ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట నిర్మిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో ఇది నాలుగో సినిమాగా తెరకెక్కుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news