నిన్నటికి నిన్న.. టాలీవుడ్ లో నందమూరి బాలయ్య 50 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. సినీ స్వర్ణోత్సవాల పేరుతో భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహించారు. బాలయ్య కుటుంబ సభ్యులు.. బంధువులు అంతా వచ్చారు. చంద్రబాబు, లోకేష్ రాలేదు. ఏపీలో వర్షాలతో అతలాకుతలంగా ఉంది కనుక.. వారు ఎవరు రాలేదు. ఇక ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు అందుబాటులో లేక రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఉందా.. లేదా.. అన్నది క్లారిటీ లేదు. ఎన్టీఆర్ మాత్రం కర్ణాటక పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఫంక్షన్‌కు అందరూ వచ్చిన బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మాత్రం రాలేదు. నిజానికి ఇలాంటి ఫంక్షన్‌కు మోక్షజ్ఞ తప్పనిసరిగా రావాలి.
ఎందుకంటే తండ్రి బాలయ్య సాధించిన అపూర్వమైన ఫీట్ ఇది. పైగా త్వరలో మోక్షజ్ఞ టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కాబోతున్నాడు. అందుకే ఈ ఫంక్షన్‌కు మోక్షజ్ఞ వస్తాడని అందరూ అనుకున్నారు. మోక్షజ్ఞ రకరకాల శిక్షణలో బిజీగా ఉన్నాడు. విశాఖలో డైలాగ్, నటన, శిక్షణను సత్యానంద దగ్గర తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఈ ఫంక్షన్‌కు వస్తే కెమెరాల కళ్ళు అన్ని సహజంగానే మోక్షజ్ఞ మీద ఉంటాయి. త్వరలో హీరోగా లాంఛ్ చేసినప్పుడు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది. పైగా ఈ ఫోటోలు బయటికి వెళ్తే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు కూడా ప్రచారం జరుగుతాయి. మీడియా అంతా మోక్షజ్ఞకు రకరకాల ప్రశ్నలు వేసే ప్రయత్నం చేస్తుంది.
ఇలాంటి సందేహాలకు తావు ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే.. ఈ ఫంక్షన్‌కు మోక్షజ్ఞను తీసుకురాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గత ఐదారు సంవత్సరాలుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ వచ్చింది. హనుమాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాతో ఒక్కసారిగా అందరికళ్ళు తన వైపునకు తిప్పుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజస్విని కలిసి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.