కొరటాల శివ అంటే టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కొరటాల శివ గొప్ప కథలు రాయలేదు.. మరి అంత గొప్ప సినిమాలు తీయలేదు.. కానీ కథ మీద పట్టుతో సినిమా తీయటంలో నేర్పరి అన్న పేరు తెచ్చుకున్నాడు. మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను ఈ నాలుగు సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో వాస్తవంగా చెప్పాలి అంటే భరత్ అనే నేను కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఈ నాలుగు హిట్ల తో ఆకాశంలోకి వెళ్లిన కొరటాల ఆచార్య సినిమా దెబ్బకు పాతాళంలోకి పడిపోయాడు. కొరటాల అంత గొప్ప డైరెక్టర్ అయితే కాదు స్వతహాగా రచయిత కావడంతో రచన మీద మంచి పట్టు ఉన్న మాట వాస్తవఅతడు తీసిన సూపర్ హిట్ సినిమాలలో కూడా పూర్ డైరెక్షన్.. వీక్ ఎలివేషన్లే ఉంటాయి అయితే కథ మీద పట్టుతో సినిమా ఎలాగోలా అతడి సినిమాలు గట్టెక్కుతూ వచ్చాయి. ఆచార్యతో కొరటాలలోని దర్శకుడు బలహీనత పూర్తిగా బయటపడింది. ఈరోజు ఎన్టీఆర్ తో దేవర లాంటి పాన్ ఇండియా సినిమా తీశారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు మెయిన్ మైనస్ కొరటాల శివ. ఎవరిని అడిగినా ఇదే మాట చెపుతారు. కేవలం ఎన్టీఆర్ తన భుజస్తంధాల మీద సినిమాను నడిపించి ఈ మాత్రం అయినా గట్టెక్కించాడు.
ఇందులో కొరటాల క్రెడిట్ ఎంత మాత్రం లేదు. నేపథ్యాన్ని మాత్రం కొత్తగా ఎంచుకొని సరైన కథ లేకుండా సరైన డైలాగులు రాసుకోకుండా.. ఎలివేషన్లు సీన్ల ప్లాన్ లేకుండా కొరటాల దేవర సినిమా తీసి పడేశారు. ఎన్టీఆర్ నటనకు తోడు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అదిరిపోవడంతో దేవర బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ గట్టిక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కథకు ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద భారీ డిజాస్టర్ సినిమాలలో ఒకటిగా మిగిలిపోయి ఉండేది.
ఎన్టీఆర్ వరుస హిట్లతో ఫామ్‌లో ఉండడంతో దేవర గట్టెక్కేసిందే తప్పా కొరటాల డైరెక్షన్ వల్ల కానే కాదు. దేవర చూశాక చాలా మంది చెపుతోంది ఏంటంటే కొరటాల మహేష్‌కే సూట్ అవుతాడు.. ఎలివేషన్లు లేకపోయినా నడిపిస్తారని అంటున్నారు. ఇక కొరటాలకు పెద్ద స్పాన్ ఉన్న కథలు.. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు డీల్ చేసే సీన్ లేదని.. మరోసారి కొరటాల డైరెక్షన్ బలహీనత దేవరతో బయట పడిందనే వారు ఉన్నారు. దేవర కల్కి, సలార్ రేంజ్ అంచనాలు అందుకోలేదు… ఈ సినిమా క్రెడిట్ అంతా ఎన్టీఆర్ , అనిరుధ్ ఖాతాలోనే పడింది.
కొరటాల తర్వాత బన్నీతో సినిమా అంటున్నా అది ఎప్పటకి ఉంటుందో తెలియదు.. మధ్యలో బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు చేయాలి… ఇక కొరటాలతో టైర్ 2 హీరోలు తప్పా ఎవ్వరూ రిస్క్ చేసే పరిస్థితి ఉండదంటున్నారు. ఒక వినాయక్, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసే రేంజ్ నుంచి టైర్ 2 హీరోలు కూడా డేట్లు ఇవ్వని రేంజ్‌కు ఎలా పడిపోయారో… రేపో మాపో కొరటాల పరిస్థితి కూడా అలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.