న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ విజయాలతో యమా జోరు చూపిస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాల తర్వాత ఇటీవల సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకులను పలకరించిన నానికి మరో సూపర్ హిట్ వచ్చి పడింది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను డివివి దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. ప్రతినాయకుడి పాత్రను విలక్షణ నటుడు ఎస్.జె సూర్య పోషించాడు.
ఆగస్టు 29న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఏకంగా 80 శాతం వసూళ్లను రికవరీ చేసేసి.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ఎఫెక్ట్ పడినప్పటికీ.. సరిపోదా శనివారం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు సరిపోదా శనివారం స్ట్రీమింగ్ కు డేట్ లాక్ చేశారట. సెప్టెంబర్ 27న నాని లేటెస్ట్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.