తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న 14 మంది కంటెస్టెంట్స్ లో కిరాక్ సీత ఒకటి. రాయలసీమకు చెందిన సీత యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది. బోల్డ్ వీడియోలు చేస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత టీవీ షోలు, సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీతో కిరాక్ సీత మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సీత ఒకటిగా కనిపిస్తోంది. ఇకపోతే బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీత.. తన లైఫ్ లో ఉన్న స్యాడ్ లవ్ స్టోరీ రివీల్ చేసింది.
ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఐదేళ్ల పాటు ఒక అబ్బాయితో కిరాక్ సీత రిలేషన్ లో ఉందట. లవ్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కల నెరవేరలేదు. సీతను సదరు అబ్బాయి పేరెంట్స్ కోడలిగా యాక్సెప్ట్ చేయలేదు. ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యమని భావించిన సీత.. సదరు అబ్బాయితో విడిపోయింది. ఐదేళ్లపాటు ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకుంటే ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్రేకప్ తర్వాత ఆ నరకాన్ని సీత చాలా రోజులు అనుభవించింది. ఆ తర్వాత వర్క్ బిజీ అయిపోయింది.