Moviesఏడాదికి రూ. 14 కోట్లు.. టాలీవుడ్ లో అత్యధిక ట్యాక్స్ పే...

ఏడాదికి రూ. 14 కోట్లు.. టాలీవుడ్ లో అత్యధిక ట్యాక్స్ పే చేసిన‌ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

సినీ తార‌ల సంపాద‌న మాత్ర‌మే కాదు వారు క‌ట్టే ట్యాక్స్ కూడా క‌ళ్లు చెదిరే రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఫార్చూన్ ఇండియా సంస్థ 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గాను అత్యధిక ట్యాక్స్ పే చేసిన సెలబ్రిటీల లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి కేవ‌లం ఒక్క హీరోకు మాత్ర‌మే చోటు ద‌క్కింది. ఇంతకీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికి అల్లు అర్జున్ ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టి టాలీవుడ్ లో హైయెస్ట్ ట్యాక్స్ పేయ‌ర్ గా టాప్ ప్లేస్ లో నిలిచాడు.

ఈ లెక్క‌న అల్లు అర్జున్ సంపాద‌న ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమాల‌కు రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్న బ‌న్నీ.. మ‌రోవైపు యాడ్స్‌, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ అంటూ కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ మరియు రెస్టారెంట్ చైన్ అయిన బఫెలో వైల్డ్ వింగ్స్ కోసం అల్లు అర్జున్ ఫ్రాంచైజీని కలిగి ఉన్నారు.

అలాగే ప్ర‌ముఖ‌ ప్లాట్‌ఫారమ్ అయిన ఆహాకు అల్లు అర్జున్ కో-ఫౌండ‌ర్ గా ఉన్నాడు. అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ అనే ఆధునిక మల్టీప్లెక్స్ ద్వారా కూడా అల్లు అర్జున్ భారీగా సంపాదిస్తున్నాడు. అందుకే ఆ స్థాయిలో ట్యాక్స్ క‌డుతున్నాడ‌ని అంటున్నారు. ఇకపోతే ఫార్చూన్ ఇండియా సంస్థ విడుద‌ల చేసిన జాబితా ప్ర‌కారం.. 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గాను అత్యధిక ట్యాక్స్ పే చేసిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌ను ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట.

రూ. 80 కోట్లు ట్యాక్స్ పే చేసి కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ రెండో స్థానంలో ఉంటే.. రూ. 75 కోట్లు ట్యాక్స్ చెల్లించి సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. అమితాబ్ బచ్చన్(రూ. 71 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ. 66 కోట్లు), అజయ్ దేవగన్ (రూ. 42 కోట్లు), ఎమ్మెస్‌ ధోని (రూ. 38 కోట్లు), రణబీర్ కపూర్ (రూ. 36 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 28 కోట్లు), కపిల్ శర్మ (రూ. 26 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు), కరీనా కపూర్ (రూ. 20 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 14 కోట్లు), మోహన్ లాల్ (రూ. 14 కోట్లు), అల్లు అర్జున్ (రూ. 14 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు), కియారా అద్వానీ (రూ. 12 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 11 కోట్లు), పంకజ్ త్రిపాఠి (రూ. 11 కోట్లు), అమీర్ ఖాన్ (రూ. 10 కోట్లు), రిషబ్ పంత్ (రూ. 10 కోట్లు) ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news