సినీ పరిశ్రమలో కథలు చేతులు మారడం అనేది చాలా కామన్. ఒక హీరో వద్దన్న కథను మరొక హీరో పట్టుకోవడం తరచూ జరుగుతూనే ఉంటుంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనూ అటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఓసారి ఇద్దరు హీరోలు కథ నచ్చక ఛీ కొడితే.. రవితేజ మాత్రం అదే కథతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. ఇడియట్. ఇదొక యాక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రమిది.
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తర్వాత రవితేజ మరియు పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన రెండో సినిమా. ఇందులో రక్షిత హీరోయిన్ గా నటిస్తే.. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత, కైకాల సత్యనారాయణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 2002లో రిలీజ్ అయిన ఇడియట్ మూవీ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్, రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, సాంగ్స్, రక్షిత అందాలు, పూరి మార్క్ డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
టాక్ పాజిటివ్ గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఇడియట్ దుమ్ము దులిపేసింది. 36 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డు సెట్ చేసింది. అయితే వాస్తవానికి ఇడియట్ మూవీలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదు. మొదట పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలని పూరి భావించారు. పవన్ కళ్యాణ్ ను కలిసి కథ కూడా చెప్పారు. కానీ ఆయనకు స్టోరీ నచ్చకపోవడంతో సున్నితరంగా తిరస్కరించారు.
ఆ తర్వాత మహేష్ బాబును కలవగా.. ఆయన కూడా ఏవో రీజన్స్ తో రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా ఇడియట్ లో యాక్ట్ చేసే ఛాన్స్ రవితేజ కొట్టేశాడు. స్టోరీ బాగా నచ్చడమే కాకుండా పూరిపై ఉన్న నమ్మకంతో రవితేజ ఇడియట్ చేసేందుకు ధైర్యంగా ముందడుగు వేశారు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వసూళ్ల వర్షం కురిపించింది. రవితేజకు భారీ స్టార్డమ్ ను అందించింది.