మెగాస్టార్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన రెండు మూడు సినిమాలతోనే మెగా పవర్ స్టార్ గా బిరుదు తెచ్చుకున్నారు. అయితే అలాంటి రామ్ చరణ్ పై ఇండస్ట్రీలో ఎలాంటి మచ్చలేదు.అయితే మొదటి సినిమా హీరోయిన్ తో మాత్రం ఒక కాంట్రవర్సీ జరిగిన సంగతి మనకు తెలిసిందే. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని రామ్ చరణ్ ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టేశారు.ఇదంతా పక్కన పెడితే తన శాడిజంతో ఓ హీరోయిన్ ని రామ్ చరణ్ ఘోరంగా అవమానించారని అప్పట్లో ఓ టాక్ వినిపించింది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు రామ్ చరణ్ అంత శాడిజంగా ప్రవర్తించారు అనేది ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ శాడిజంగా ప్రవర్తించింది ఏ హీరోయిన్ తోనో కాదు కాజల్ అగర్వాల్.. అవును మీరు వినేది నిజమే.. అయితే కాజల్ అగర్వాల్ తో శాడిజం గా ప్రవర్తించారు అంటే మరీ రూడ్ గా కాదు.. ఇక విషయంలోకి వెళ్తే..కాజల్ రామ్ చరణ్ రెండో మూవీ అయిన మగధీర సినిమాలో నటించి టాప్ హీరోయిన్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ మగధీర మాత్రమే కాదు గోవిందుడు అందరివాడేలే, నాయక్ సినిమాలో కూడా చెర్రీతో జత కట్టింది.. ఇక వీరి కాంబోలో మెరుపు సినిమా కూడా రావడానికి పూజ కార్యక్రమాలు జరుపుకుంది.కానీ ఎందుకో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక రాంచరణ్ కి కాజల్ కి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది అంటే..మగధీర సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కాజల్ ని తరచూ ఇబ్బంది పెట్టే వారట.
ఇక రామ్ చరణ్ దగ్గర ఉన్న గుర్రం పేరు కాజల్ అని పెట్టుకున్నారట.ఆ గుర్రం పేరు మగధీర మూవీలో చేసే హీరోయిన్ పేరు ఒకటే కావడంతో ప్రతిసారి కాజల్ అంటూ తన గుర్రాన్ని పిలుస్తున్నట్టు పిలిచి కాజల్ ని ఆటపట్టించే వారట. ఇక రామ్ చరణ్ అలా సరదాగానే చేసినప్పటికీ కాజల్ మాత్రం అప్పుడప్పుడు చాలా ఫీల్ అవుతూ అవమానంగా భావించేదట. ఇక ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ రామ్ చరణ్ వల్ల ఆ సినిమా సమయంలో నేను కాస్త అవమానంగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే రామ్ చరణ్ అలా కాజల్ ని సరదాగా ఆటపట్టించారు. ఒకవేళ సీరియస్ అయితే కాజల్ అన్ని సినిమాల్లో రామ్ చరణ్ తో జత కట్టేది కాదు కదా అని ఆయన అభిమానులు అంటున్నారు.