Moviesఅఫీషియ‌ల్‌: బాల‌య్య - మ‌హేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌… !

అఫీషియ‌ల్‌: బాల‌య్య – మ‌హేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌… !

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల పర్వం ఊపొందుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరూ మరో టాప్ హీరోతో సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లో అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేశారు. మహేష్ బాబు ఇప్పటికే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎవ్వరు ఊహించని ఓ మల్టీ స్టార్ ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బీజం పడినట్లు తెలుస్తోంది. అది కూడా నట‌సింహం నందమూరి బాలకృష్ణ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కావటం విశేషం.

ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు థ‌మ‌న్‌ చెప్పేశారు. థ‌మన్ ఈ మల్టీస్టారర్ సినిమాపై ఇప్పుడు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తాను బాలకృష్ణ – మహేష్ బాబు కాంబినేషన్ కథ‌ విన్నాను.. అని ఆ సినిమాకు కూడా తానే పనిచేస్తున్నట్టు తమను తెలిపారు. ఈ సెన్సేషనల్ మల్టీ స్టార్ టాలీవుడ్లో రానున్న రోజుల్లో రాబోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ – మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమా తెర‌కెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎవరు … ఎలాంటి సబ్జెక్టుతో ప్లాన్ చేస్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news